విజయ్ దేవరకొండ, దర్శకుడు పరశురామ్ కాంబోలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ స్టార్ విడుదల తేదీ నిర్ణయించడంలో నిర్మాత దిల్ రాజు ముందో చిక్కు వెనకో ముప్పుని ఎదురుకుంటున్నట్టు ఇన్ సైడ్ టాక్. ఇంకా షూటింగ్ బ్యాలన్స్ ఉన్నప్పటికీ మార్చి రెండో వారానికల్లా గుమ్మడికాయ కొట్టేస్తారని వినికిడి. ఆ నెలాఖరున విడుదల చేసే విషయంగా తీవ్ర సమాలోచనలు జరుగుతున్నట్టు తెలిసింది. మార్చి 30 టిల్లు స్క్వేర్ వస్తుందనే వార్త నిన్నే లీక్ అయ్యింది. ఒకవేళ దేవర కనక ఏప్రిల్ 5 రాకపోతే ఆ పరిణామం తనకు అనుకూలంగా మార్చుకోవడానికి నిర్మాత నాగవంశీ రెడీగా ఉన్నారు.
దీన్ని ఫ్యామిలీ స్టార్ కూడా వాడుకోవాలని చూస్తోంది. ఏదైనా కారణాల వల్ల దేవర తప్పుకుంటే దాని స్థానంలో ఏప్రిల్ 5 ఫ్యామిలీ స్టార్ తేవాలని చూస్తున్నారట. ఇంకోపక్క జూనియర్ ఎన్టీఆర్ నిర్మాతలు తమ డేట్ లో ఎలాంటి మార్పు లేదని వాయిదాకు సంబంధించిన వార్తలున్న ట్విట్టర్ హ్యాండిల్స్ కు సమాధానం చెబుతూ క్లారిటీ ఇస్తున్నారు. అయితే ప్యాన్ ఇండియా మూవీస్ ఏవైనా సరే ఖచ్చితంగా మాటకు కట్టుబడి ఉండే పరిస్థితులు లేవు. పైగా పాటల చిత్రీకరణ బ్యాలన్స్ ఉన్న దేవర ఇంకో డెబ్భై రోజుల్లోనే మొత్తం పూర్తి చేసుకోవాల్సి ఉంది. అందుకే పలు సందేహాలు తలెత్తుతున్నాయి.
ఒకవేళ ఫ్యామిలీ స్టార్ కనక ఏప్రిల్ లో రావాలనుకుంటే భారతీయుడు 2తో సహా చాలా పెద్ద పోటీ స్వాగతం చెబుతుంది. విజయ్ దేవరకొండ వీలైనంత సోలో రిలీజ్ ని కోరుకుంటున్నాడు. కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే కంటెంట్ కావడంతో పెద్ద సినిమాలతో తలపడి వసూళ్లు పంచుకోవడం కంటే ఒక్కడిగా వస్తే మంచి ఫలితం దక్కుతుందని అతని అభిప్రాయం. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఫ్యామిలీ స్టార్ ఫారిన్ షెడ్యూల్ వల్ల లేట్ అయ్యింది . లేదంటే ఫస్ట్ కాపీ ఎప్పుడో సిద్ధమయ్యేది. మరి దిల్ రాజు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని అభిమానులు ఎదురు చూస్తున్నారు.
This post was last modified on January 21, 2024 1:02 pm
వైసీపీ పాలనా కాలంలో తిరుమల శ్రీవారి పరకామణిలో 900 డాలర్ల చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తిరుమల…
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…