సినిమాల విషయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బహుముఖ ప్రజ్ఞ గురించి అందరికీ తెలిసిందే. ఆయన కేవలం హీరో కాదు.. దర్శకుడు, రచయిత, యాక్షన్ కొరియోగ్రాఫర్, లిరిసిస్ట్.. ఇంకా సింగర్ కూడా. గాయకుడిగా అరడజనుకు పైగానే పాటలు పాడాడు పవన్. అత్తారింటికి దారేది సినిమాలో పాడిన కాటమరాయుడా సహా పవన్ పాడిన పాటలు అన్నీ పాపులర్ అయ్యాయి. చివరగా ఆయన అజ్ఞాతవాసి సినిమాలో ఓ పాట పాడాడు.
ఆ తర్వాత మళ్లీ ఆ ప్రయత్నం చేయలేదు. త్వరలోనే మళ్లీ పవన్ ఓ పాట పాడేందుకు గొంతు సవరించుకోబోతున్నాడట. అది పవర్ స్టార్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఓజీ సినిమా కోసం కావడం విశేషం. ఓజీ సినిమాలో పవన్ ఓ పాట పాడతాడు అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం గురించి సంగీత దర్శకుడు స్వయంగా స్పందించాడు.
ఇందులో పవన్ పాట పాడేందుకు ఒక మంచి సందర్భం ఉందని.. ఆ దిశగా ఆలోచిస్తున్న మాట నిజమే అని తమన్ వెల్లడించాడు. దీంతో మళ్ళీ పవన్ పాట వినబోతున్నామని అభిమానులు ఫిక్స్ అయిపోయారు. పవన్ చాలా వరకు సరదాగా ఉండే పాటలే పాడుతుంటాడు. అయితే ఓజీ స్ఫూర్తి సీరియస్ సినిమాలా కనిపిస్తోంది. దాన్ని టీజర్ చాలా ఇంటెన్స్ గా అనిపించింది.
ఇలాంటి సినిమాలో పవన్ ఇలాంటి పాట పాడుతాడు అనేది ఆసక్తికరం. సాహో దర్శకుడు సుజిత్ రూపొందిస్తున్న ఓజీపై ముందు నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. దీని టీజర్ రిలీజ్ అయ్యాక అంచనాలు ఇంకా పెరిగిపోయాయి. పవన్ పొలిటికల్ కమిట్మెంట్ల కోసం ఈ సినిమా షూటింగ్ ఆగింది. ఆయన మళ్లీ అందుబాటులోకి రాగానే చకచకా సినిమాను పూర్తి చేసి ఈ ఏడాది ద్వితీయార్ధంలో రిలీజ్ చేసే అవకాశం ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates