బాహుబలి నుంచి ప్రభాస్ లో రొమాంటిక్ అండ్ స్వీట్ డార్లింగ్ కనిపించడం తగ్గిందని ఎదురు చూస్తున్న అభిమానులకు గొప్ప ఊరట కలిగిస్తూ మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న ప్యాన్ ఇండియా మూవీకి ‘ది రాజాసాబ్’ టైటిల్ ని ఖరారు చేస్తూ అఫీషియల్ పోస్టర్ విడుదల చేశారు. ఇవాళ సాయంత్రం భీమవరంలో అతి పెద్ద డిజిటల్ కటవుట్ ని ఆవిష్కరించడం ద్వారా కొత్త ట్రెండ్ ని సెట్ చేయబోతున్నారు. లుంగీపైకి లాగి చేతులతో దాన్ని రెండు వైపులా పట్టేసుకుని ప్రభాస్ ఇచ్చిన స్మైల్ రాబోయే విజయాన్ని సూచిస్తున్నట్టే ఉందని అభిమానులు సంబరపడుతున్నారు.
ఇలాంటి లుక్ లో ప్రభాస్ ని చూసి ఎంత కాలమయ్యిందో. సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ ఎంత బ్లాక్ బస్టర్ అయినా అందులో ఫ్యామిలీస్ కోరుకునే కూల్ రెబెల్ స్టార్ లేడు. కోపాన్ని అణుచుకున్న లావాలాగా సీరియస్ పాత్రను చేశాడు. కానీ ది రాజాసాబ్ దీనికి భిన్నంగా ఉంటుంది. హారర్ టచ్ ఉన్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ కావడంతో కథ ఎలా ఉంటుందోననే ఆసక్తి ప్రేక్షకుల్లో విపరీతంగా ఉంది. ఎందుకంటే ప్రభాస్ ఇప్పటిదాకా ఈ జానర్ టచ్ చేయలేదు. మారుతీ మార్క్ వినోదం ఉంటుంది కాబట్టి బుజ్జిగాడు టైపు వింటేజ్ కామెడీని ఎంజాయ్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడో చెప్పలేదు కానీ షూటింగ్ చివరి దశకు వచ్చాక మాత్రమే దాని గురించి నిర్ణయం తీసుకోబోతున్నారు. తమన్ సంగీతం సమకూరుస్తున్న ది రాజా సాబ్ ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. అయిదు భాషల్లో ఆడియన్స్ ని అలరించనుంది. కల్కి 2898 ఏడి మే నెలలో కన్ఫర్మ్ చేసుకుంది కాబట్టి రాజాసాబ్ డిసెంబర్ లో వచ్చే అవకాశాలు కొట్టిపారేయలేం. లేదూ అనుకుంటే 2025 సంక్రాంతి బరిలో ఉండొచ్చు. రకరకాల క్యాలికులేషన్ల మీద ఇది ఆధారపడి ఉంది. మొత్తానికి ఆల్ ఇన్ వన్ ఫుల్ మీల్స్ తరహాలో ప్రభాస్ ని కొత్తగా చూపించబోతున్నాడు మారుతీ.
This post was last modified on January 15, 2024 9:45 am
మెల్లగా గేమ్ ఛేంజర్ గేరు మారుస్తోంది. ఇప్పటికే మూడు పాటలు, ఒక టీజర్ వచ్చాయి. ఎల్లుండి జరగబోయే యుఎస్ ప్రీ…
ఏపీ ఫైబర్ నెట్ సంస్థపై వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక అవకతవకల గురించి ఆ సంస్థ చైర్మన్ జీవీ…
బాలీవుడ్ లో అత్యంత వేగంగా 600 కోట్ల గ్రాస్ దాటిన తొలి ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించిన పుష్ప 2…
వైసీపీ మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ నేత అంబటి రాంబాబు తన దూకుడు స్వభావంతో, వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.…
పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష కూటములకు చెందిన ఎంపీల మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఈ ఘటనలో బీజేపీ ఒడిశా…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ మొదటి షెడ్యూల్ ని…