ఇంకా రెగ్యులర్ షూటింగ్ లో చిరంజీవి అడుగు పెట్టకుండానే మెగా 156 గురించి దర్శకుడు వశిష్ట తెగ ఊరిస్తున్నాడు. రేపు టైటిల్ పోస్టర్ తో పాటు దాన్ని రివీల్ చేసే చిన్న వీడియోని రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా ఒక ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు చెబుతూ ఫ్యాన్స్ కి ఎగ్జైట్ మెంట్ కలిగించడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది మెగాస్టార్ కెరీర్ టాప్ 3లో ఖచ్చితంగా ఉంటుందని, భవిష్యత్తులో ఎప్పటికీ చెప్పుకునే గొప్ప చిత్రమవుతుందని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పడం చూస్తే స్క్రిప్ట్ ఓ రేంజ్ లో సిద్ధమైనట్టు కనిపిస్తోంది.
జగదేకవీరుడు అతిలోకసుందరి తరహాలో ఎవర్ గ్రీన్ గా ఉంటుందని అన్నాడు. కథ వినిపించినప్పుడు ఏదైతే ఓకే చేయించుకున్నానో అప్పటి నుంచి ఎలాంటి మార్పులు లేకుండా యధాతథంగా తెరకెక్కించేందుకు చిరంజీవి ఫ్రీడమ్ ఇచ్చారని చెప్పిన వశిష్ట 2025 సంక్రాంతికి సినిమా రిలీజ్ చేస్తామని చెబుతున్నాడు. ఇది ముందే లీకైన వార్తే అయినప్పటికీ ఈ సంవత్సరమే దసరా లేదా దీపావళికి రావొచ్చని ఫ్యాన్స్ అంచనా వేశారు. కానీ వాటిని కొట్టి పారేస్తూ వచ్చే జనవరి పండక్కు ఇప్పుడే కర్చీఫ్ వేశాడు. ఇలాంటి ప్యాన్ ఇండియా సినిమాలు అంత ఈజీగా మాటకు కట్టుబడిలేవు.
బింబిసార బ్లాక్ బస్టర్ తర్వాత మెగా ఆఫర్ కావడంతో వశిష్ట పక్కాగా ప్లానింగ్ తో ముందుకెళ్తున్నాడు. ఇంకా హీరోయిన్లను ఫైనల్ చేసింది లేనిది చెప్పలేదు. చిరంజీవి ఇమేజ్ ని కొత్త దర్శకులు పెంచాల్సిన పని లేదని, ఎంతో ఎత్తులో ఉన్న ఆ పేరుని చెడగొట్టకుండా కాపాడుకుంటే చాలని చెప్పడం చూస్తే కుర్రాడు మంచి క్లారిటీతో ఉన్నాడని అర్థమవుతోంది. కీరవాణి సంగీతం సమకూరుస్తున్న ఈ ఫాంటసీ డ్రామాకు చోటా కె నాయుడు ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కి ఎక్కువ సమయం కేటాయించడం కోసం అక్టోబర్ లోగా షూట్ పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారట.
This post was last modified on January 14, 2024 9:04 pm
యావత్తు దేశం ఆసక్తిగా ఎదురు చూస్తున్న వక్ఫ్ సవరణ చట్టంపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. భారత…
నేను లోకల్, ధమాకా దర్శకుడు త్రినాధరావు నక్కిన ఇవాళ జరిగిన చౌర్య పాఠం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడుతూ…
భారత్ నుంచి పరారైపోయిన ప్రముఖ వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీకి సంబంధించి రోజుకో కొత్త తరహా వింతలు, విశేషాలు వెలుగు…
తాజాగా మరో రాజ్యసభ సీటుకు సంబంధించి ఎన్నికలకు రంగం రెడీ అయింది. వైసీపీ నాయకుడు, కీలక నేతల వేణుంబాకం విజయ…
ఇటీవలే విడుదలైన రవితేజ మాస్ జాతర పాటలో స్వర్గీయ చక్రి గొంతు విని సంగీత ప్రియులు ఆశ్చర్యపోయారు. అభిమానులు భావోద్వేగానికి…