స్టార్ హీరో హీరోయిన్లు ఉన్న సినిమాను నిర్మాతలు థియేట్రికల్ రిలీజ్ చేయడానికే ఇష్టపడతారు. కరోనా టైంలో ఓటిటి విప్లవం నడిచింది కానీ ఇప్పుడు తగ్గుముఖం పట్టింది. జనాలు హ్యాపీగా హాళ్లకు వెళ్లి టికెట్లు కొని ఎంజాయ్ చేస్తున్నారు. అయినా సరే కొందరు ఈ యాంగిల్ లో రిస్క్ చేయడం ఇష్టం లేక మంచి ఆఫర్ వస్తే జై డిజిటల్ అంటున్నారు. కీర్తి సురేష్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన ‘సైరెన్’ ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. పొన్నియిన్ సెల్వన్ తో మనకు దగ్గరైన జయం రవి డ్యూయల్ రోల్ చేసిన యాక్షన్ థ్రిల్లర్ ఇది. కమర్షియల్ అంశాలు దట్టించారు.
ట్రైలర్ వచ్చాక క్రేజ్ కూడా బాగానే వచ్చింది. అయితే దీన్ని నేరుగా ఓటిటిలో విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. జనవరి 26న జీ5 వేదికగా రావొచ్చని చెన్నై టాక్. ఇటీవలే అధికారికంగా ధృవీకరించడంతో క్లారిటీ వచ్చింది. అనుపమ పరమేశ్వరన్ ఇంకో హీరోయిన్ గా చేసింది. ఆంటోనీ భాగ్యరాజ్ దర్శకుడు. ఇందులో సముతిరఖని, యోగిబాబు తదితరులు కీలక పాత్ర పోషించారు. తెలుగు వెర్షన్ కూడా డబ్బింగ్ చేస్తున్నారు. తీరా చూస్తే ఇప్పుడీ న్యూస్ ఆశ్చర్యపరిచేదే. ఇంత క్యాస్టింగ్ పెట్టుకుని ఇలాంటి నిర్ణయం తీసుకోవడం షాక్.
కంటెంట్ మీద నమ్మకం పూర్తిగా లేకపోవడం వల్లనో లేదా బయట జరిగే బిజినెస్ ని మించి ఓటిటి హక్కుల కోసం డీల్ రావడమో జరిగితే తప్ప ఇలా ఎవరు చేయరు. సైరెన్ లో మనకు తెలుసున్న ఆర్టిస్టులే ఎక్కువగా ఉన్నారు కాబట్టి సరైన ప్రమోషన్లు చేసుకుంటే ఇక్కడా బజ్ తెచ్చుకోవచ్చు. గత కొన్ని నెలలుగా డిజిటల్ మార్కెట్ బాగా తగ్గుముఖం పట్టింది. ఓటిటి సంస్థలు సరికొత్త కండీషన్లతో నిర్మాతలను ముప్పతిప్పలు పెడుతున్నాయి. ఆ ప్రభావం మీడియం రేంజ్ హీరోల మార్కెట్ మీద పడుతోంది. అయినా సరే ఓటిటి రూటు పట్టడం అనూహ్యమనే చెప్పాలి.
This post was last modified on January 14, 2024 2:17 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…