మహేష్ త్రివిక్రమ్ ఇంటర్వ్యూ ఏమైందంటే

మాములుగా తన కొత్త సినిమా రిలీజ్ టైంలో మహేష్ బాబు ఇంటర్వ్యూలు ఇవ్వడం పరిపాటి. ప్రెస్ మీట్స్ కూడా ఉంటాయి. కానీ ఈసారి గుంటూరు కారం విషయంలో అలాంటివి కనిపించడం లేదు. మొదటి షోకి కేవలం గంటల వ్యవధి మాత్రమే ఉన్నా ఇప్పటిదాకా మీడియాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఇన్ సైడ్ టాక్ ప్రకారం అవేవి ప్లాన్ చేయలేదట. రిలీజ్ తర్వాత ఎలాగూ బ్లాక్ బస్టర్ టాక్ వస్తుంది కాబట్టి దానికి అనుగుణంగా సక్సెస్ మీట్, ముఖాముఖీ కార్యక్రమాలు చేసే ఉద్దేశంతో ప్రీ రిలీజ్ కు ముందు వద్దనుకున్నారని వినికిడి. టైం లేకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది.

నెలల క్రితమే అభిమానులకు ఓ రేంజ్ లో ఎలివేషన్లు ఇచ్చిన నిర్మాత నాగవంశీ సైతం అందుబాటులో లేరు. సమయం లేకపోవడంతో పాటు విడుదలకు సంబంధించి చివరి నిమిషం ఒత్తిళ్లు, థియేటర్ల సర్దుబాటు, బిజినెస్ వ్యవహారాలు తదితర పనులతో ఆయనా ఛానల్స్, వెబ్ సైట్లకు దూరంగా ఉండాల్సి వచ్చింది. మ్యాడ్ లాంటి చిన్న సినిమాకే దగ్గరుండి విశేషాలు పంచుకున్న వంశీ హఠాత్తుగా సైలెంట్ అయిపోవడం ఫ్యాన్స్ ని ఆశ్చర్యపరిచినా జనవరి 12 తర్వాతే అందుబాటులోకి రావొచ్చు. హీరోయిన్లు శ్రీలీల, మీనాక్షి చౌదరిలతో ఏదైనా ప్లాన్ చేశారా అంటే అదీ లేదు.

సో ఇప్పటికైతే ఫాన్స్ ముందు థియేటర్లో గుంటూరు కారం ఎంజాయ్ చేసొచ్చి ఆ తర్వాత టీమ్ కబుర్లు పంచుకోవడాన్ని చిన్ని తెరపై చూడొచ్చు. దాని షూటింగ్ జరిగిందో లేదో గుట్టుగా ఉంచుతున్నారు. త్రివిక్రమ్ సైతం లో ప్రొఫైల్ మైంటైన్ చేస్తూ అన్నీ తర్వాతే అనే ధోరణి చూపిస్తున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా ర్యాంపేజ్ చేస్తున్న వెంకటరమణరెడ్డి(మహేష్ పాత్ర పేరు) ఫస్ట్ డే రికార్డులను వేటాడే పనిలో ఆల్రెడీ పడ్డాడు. దాదాపు అన్ని ఏరియాల్లో రికార్డు స్థాయిలో షోలు పడుతున్నాయి. టికెట్ రేట్ల వల్ల ఏపీలో కొంత ప్రభావం పడినా వరల్డ్ వైడ్ కలిపి డే వన్ నెంబర్స్ షాక్ ఇవ్వడం ఖాయమే.