చిన్నది పెద్దది అంటే సినిమాల రేంజ్ పరంగా అని అనిపించవచ్చు. కానీ ఈ లెక్క వేరు. ఇది సంక్రాంతి సినిమాల రన్ టైంకు సంబంధించిన విషయం. పండక్కి రిలీజ్ అవుతున్న నాలుగు సినిమాల్లో అన్నిటికంటే చిన్నది సైంధవ్ కాగా.. అన్నిటికంటే పెద్దది గుంటూరు కారం. సంక్రాంతి సినిమాలకు కొన్ని రోజుల ముందే సెన్సార్ పూర్తి కావడంతో వాటిని నిడివి వివరాలు బయటకు వచ్చాయి. ఈ రోజుల్లో పెద్ద హీరోల సినిమాలు అంటే రెండున్నర గంటలకంటే ఎక్కువ రన్ టైం ఉంటోందన్న సంగతి తెలిసిందే. మహేష్ సినిమా కూడా అందుకు మినహాయింపు కాదు.
గుంటూరు కారం ఈ సంక్రాంతి సినిమాల్లోకెల్లా అత్యధికంగా 2 గంటల 39 నిమిషాల రన్ టైమ్‌తో విడుదలవుతోంది. ఇక పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతున్న హనుమాన్ మూవీకి కూడా దాదాపుగా ఇంతే నిడివి ఉంది. ఆ సినిమా రన్ టైమ్ 2 గంటల 38 నిమిషాలు. కింగ్ నాగార్జున హీరోగా నటించిన రూరల్ యాక్షన్ డ్రామా నా సామిరంగ 2 గంటల 26 నిమిషాల నిడివి కలిగి ఉంది. ఇక సంక్రాంతి సినిమాలు అన్నిట్లోకెల్లా తక్కువ నిడితో రిలీజ్ అవుతున్నది సైంధవ్ మూవీనే. ఆ సినిమా రన్ టైం 2 గంటల 20 నిమిషాలు.
పోయినేడాది సంక్రాంతికి వచ్చిన వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి చిత్రాలు రెండు కూడా దాదాపు మూడు గంటలు నిడివితో రిలీజ్ అయి మంచి ఫలితాన్ని అందుకున్నాయి. సినిమా ఎంగేజ్ చేయాలి కానీ ఎంత నిడివి అన్నది పెద్ద విషయమే కాదు.
This post was last modified on January 11, 2024 10:28 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…