నిన్న సాయంత్రం నుంచి సోషల్ మీడియా మొత్తం చక్కర్లు కొడుతున్న పుకారుకి ఓజి టీమ్ అఫీషియల్ గా స్పందించింది. డివివి ఎంటర్ టైన్మెంట్స్ నుంచి ఈ ప్రాజెక్టు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి వెళ్లిపోయిందనే వార్త ఫ్యాన్స్ లో ఖంగారు పుట్టించింది. దీంతో ఇది నిజమో కాదో చెప్పమని కొన్ని వేల ట్వీట్లు సదరు ప్రొడక్షన్ హౌస్ ని ట్యాగ్ చేస్తూ పెట్టేశారు. బదులు వచ్చే లోపే టాపిక్ వైరల్ కావడంతో రకరకాల అనుమానాలు తలెత్తాయి. బ్రో నుంచి పవన్ తో అనుబంధం పెంచుకున్న నిర్మాత టిజి విశ్వప్రసాద్ నిజంగానే ఓజిని తీసుకున్నారేమో అనే రేంజ్ లో హడావిడి జరిగింది.
OG ఎప్పటికీ మాదేనని, కొంత ఆలస్యమైనా సరే ఆకలి తీర్చుకోవడం కోసం చీతా రావడం ఖాయమని డివివి సంస్థ అఫీషియల్ ఎక్స్ హ్యాండిల్ లో ప్రకటించింది. పవన్ కళ్యాణ్ సినిమా గురించి పూర్తి క్లారిటీతో ఉన్నామని, ఎప్పుడు రావాలో సరైన సమయం చూసుకుని మిమ్మల్ని వేటాడ్డం ఖాయమని చిన్న సైజు ఎలివేషన్ ఇచ్చింది. దీంతో పుకార్ల పర్వానికి ఫుల్ స్టాప్ పడ్డట్టే. ఎవరు పుట్టించారనేది పక్కన పెడితే ఆర్ఆర్ఆర్ లాంటి ప్యాన్ ఇండియా మూవీని నిర్మించిన డివివి దానయ్య కేవలం బడ్జెట్ కారణంగానో లేక ఇంకేదైనా రీజన్ వల్లనో పవన్ కళ్యాణ్ మూవీని వదలడం అసాధ్యమని నిన్నే మా సైట్ స్పష్టతనిచ్చింది.
ఏదైతేనేం ఫ్యాన్స్ కి ఉపశమనం దక్కింది. పవన్ ప్రస్తుతం సెట్స్ మీద పెట్టిన మూడు సినిమాల్లో ఎక్కువ అంచనాలు ఉన్నది ఓజి మీదే. హరిహర వీరమల్లు మీద బజ్ తగ్గిపోయింది. ఉస్తాద్ భగత్ సింగ్ రీమేక్ కాబట్టి వచ్చాక చూద్దాంలే అనే ధోరణిలో ఫాన్స్ ఉన్నారు. సురేందర్ రెడ్డి చేయబోయే జానర్ ఇంకా లీక్ కాలేదు కనక దాని గురించి ఇప్పుడే టెన్షన్ అనవసరం. వింటేజ్ గ్యాంగ్ స్టర్ గా పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజిలో ప్రియాంక మోహన్ హీరోయిన్ కాగా తమన్ సంగీతం సమకూరుస్తున్న సంగతి తెలిసిందే. ఏపీ ఎన్నికలు జరిగి ఫలితాలు వచ్చాక పవన్ ఎప్పుడు సెట్లోకి అడుగు పెడతాడనేది తేలుతుంది.
This post was last modified on January 8, 2024 2:44 pm
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…