Movie News

సింగల్ స్క్రీన్ల కోసం హనుమాన్ ఘోష

అందరికీ సమన్యాయం సాధ్యం కాకపోయినా కనీసం సహేతుకంగా జరగాలనేది చిన్న నిర్మాతల డిమాండ్. హనుమాన్ బడ్జెట్ పరంగా, బుక్ మై షోలో ప్రేక్షకుల ఆసక్తిపరంగా ఇది పెద్ద చిత్రమనే స్పష్టత వచ్చేసింది కానీ గ్రౌండ్ లెవెల్ పరిస్థితి మాత్రం వేరుగా ఉంది. హైదరాబాద్ లో కేవలం నాలుగు సింగల్ స్క్రీన్లు మాత్రమే జనవరి 12న కేటాయించడం చూస్తే ఎలాంటి ట్రీట్ మెంట్ దక్కుతుందో అర్థం చేసుకోవచ్చు. క్రాస్ రోడ్స్ సప్తగిరి, కాచిగూడ కుమార్, సికింద్రాబాద్ అంజలి, బాలానగర్ విమల్ హనుమాన్ కోసం కేటయించారు. వీటికి ఏ పాటి ఆదరణ ఉంటుందో భాగ్యనగర వాసులకు ఎరుకే.

కనీసం పది పదిహేను అయినా ఇవ్వాలన్న నిర్మాత నిరంజన్ రెడ్డి విన్నపం ఫలించలేదు. గుంటూరు కారంకి తొంబై దాకా సింగల్ స్క్రీన్లు ఇచ్చేయడం వల్ల ఈ సమస్య వచ్చింది. ముందు ఈగల్ కోసం కేటాయించిన దేవిని నా సామిరంగకు ఇచ్చేయగా సలార్ తీసేసే ఛాన్స్ ఉన్నా సంధ్య 70 ఎంఎంలో మూడో వారమూ కొనసాగించడం హనుమాన్ కి అడ్డురాయి వేసింది. సలార్, హనుమాన్ రెండింటికి మైత్రినే డిస్ట్రిబ్యూటర్. అయినప్పటికీ ప్రభాస్ సినిమా క్రాస్ రోడ్స్ హయ్యెస్ట్ గ్రాసర్ రికార్డుకి దగ్గరగా ఉండటం వల్ల అది పూర్తి చేయించడం కోసం కొనసాగిస్తున్నారని ఫ్యాన్స్ టాక్ వినిపిస్తోంది.

మల్టీప్లెక్సుల్లో హనుమాన్ కి చెప్పుకోదగ్గ షోలు ఇచ్చినట్టు రిలీజ్ చార్ట్ లో కనిపిస్తోంది కానీ ఎన్ని దక్కాయనేది అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైతే కానీ అర్థం కాదు. ప్రసాద్, ఏఎంబి, పివిఆర్ ఐనాక్స్ లాంటి పేరున్న సముదాయాల్లో హనుమాన్, గుంటూరు కారంకి ఎన్నేసి ఆటలు ఇస్తారోనన్నది సస్పెన్స్ గా మారింది. ఇక్కడే కాదు జిల్లా కేంద్రాల్లోనూ ఇలాంటి పరిస్థితే ఉందని ట్రేడ్ రిపోర్ట్. సరే కౌంట్ పరంగా ఎంత వెనుకబడుతున్నా కంటెంట్ పరంగా మెల్లగా పుంజుకుని విజేతగా నిలుస్తామనే ధీమా మేకర్స్ లో కనిపిస్తోంది. రేపు చిరంజీవి అతిథిగా జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కొత్త ట్రైలర్ లాంచ్ చేయబోతున్నారు.

This post was last modified on January 6, 2024 12:08 pm

Share

Recent Posts

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

2 hours ago

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

4 hours ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

4 hours ago

వాల్యూమ్ పెంచండి జైలర్ సాబ్

ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…

6 hours ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

6 hours ago

సునీల్ యాద‌వ్ ఎవ‌రు…?

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్న సునీల్ యాద‌వ్ వ్య‌వ‌హారం…

6 hours ago