సంక్రాంతి బరి నుంచి తప్పుకున్నందుకు ఈగల్ కు సోలో డేట్ వచ్చేలా చూస్తామని ఫిలిం ఛాంబర్ పెద్దలు నిర్మాత టిజి విశ్వప్రసాద్, హీరో రవితేజకిచ్చిన మాటని నిలబెట్టుకోవడం మీద అనుమానాలు మొదలైపోయాయి. టిల్లు స్క్వేర్ ని తప్పించారు కానీ కథ అక్కడితో అయిపోలేదు. ఊరి పేరు భైరవకోన ఫిబ్రవరి 9 రిలీజ్ ప్రకటించి వారాలు గడిచాయి. మార్పు విషయంలో అనిల్ సుంకరని సంప్రదించలేదనే టాక్ ఆల్రెడీ మొదలైపోయింది. ఇంకో వైపు ఒక రోజు ముందే ఫిబ్రవరి 8కి షెడ్యూల్ చేసుకున్న యాత్ర 2 సైతం వెనుకడుగు వేసేందుకు ససేమిరా అంటోందని సమాచారం.
మార్కెట్, బ్రాండ్ ఇమేజ్ పరంగా ఈ రెండూ ఈగల్ కు సరిసమానం కాకపోయినా చెప్పుకోదగ్గ పోటీనే ఇస్తాయి. భైరవకోన, యాత్ర 2లకు బలమైన డిస్ట్రిబ్యూషన్ బ్యాకప్ ఉంది. థియేటర్లు దానికి అనుగుణంగానే ప్లాన్ చేసుకుంటారు. సంక్రాంతికి వచ్చిన గుంటూరు కారం, సైంధవ్, నా సామిరంగ, హనుమాన్ లలో ఏవైనా బ్లాక్ బస్టర్ అయితే ఎంతలేదన్నా నెల రోజుల రన్ ఉంటుంది. అలాంటప్పుడు వాటికి ఉన్న మెయిన్ స్క్రీన్లను అలాగే అట్టిపెట్టుకుంటారు. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఆ స్లాట్ లో ఉన్న ఇతర ప్రొడ్యూసర్లతో సంప్రదించి ఆ తర్వాత నిర్ణయం వెలువరించాలి.
మరి ఈగల్ కు ఓపెన్ గ్రౌండ్ వదిలేందుకు మిగిలిన ఇద్దరు నిర్మాతలు ఒప్పుకుంటారా లేదానేది వేచి చూడాలి. ప్రస్తుతానికి వాటి వాయిదా సూచనలు కనిపించడం లేదు. ప్రస్తుతం రవితేజ మిస్టర్ బచ్చన్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. బాలీవుడ్ హిట్ మూవీ రైడ్ రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమాతో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా పరిచయమవుతోంది. వీలైనంత వేగంగా రీజనబుల్ బడ్జెట్ లో పూర్తి చేసేలా దర్శకుడు హరీష్ శంకర్ పక్కా ప్లానింగ్ తో చిత్రీకరణ చేస్తున్నారు. ఈగల్ ప్రమోషన్ల కోసం తిరిగి జనవరి చివరి వారం రవితేజ అందుబాటులోకి రానున్నాడు. ఫ్యాన్స్ అంచనాలైతే భారీగా ఉన్నాయి.
This post was last modified on January 6, 2024 10:48 am
పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడు డబుల్ మర్డర్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి…
ఏపీ ఎడ్యుకేషన్ మోడల్ ఇప్పుడు జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటోంది. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా విధానాలు అందరి…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆసక్తికర విషయాన్ని దేశ ప్రజలతో పంచుకున్నారు. ``ఇది మీ సొమ్మా.. అయితే.. సొంతం చేసుకోండి.…
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ దురంధర్ అంచనాలకు మించి ఆడేస్తోంది. మరీ జవాన్, పఠాన్ రేంజులో కాదు కానీ రణ్వీర్…
గత వారం రావాల్సిన అఖండ-2.. నిర్మాతలకు, ఈరోస్ సంస్థకు మధ్య ఉన్న పాత ఫైనాన్స్ వివాదం కోర్టుకు చేరడంతో అనూహ్యంగా…
కటక్లో జరిగిన టీ20 మ్యాచ్లో టీమిండియా 101 పరుగుల భారీ విజయం సాధించినా, సోషల్ మీడియాలో మాత్రం కెప్టెన్ సూర్యకుమార్…