ఈ మధ్య సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో కొత్త ట్రెండు నడుస్తోంది. సినిమాలకు ప్రి రిలీజ్ ఈవెంట్లు ఇతర ప్రమోషన్ ఈవెంట్లు పెద్దగా ఏమీ చేయకుండానే రిలీజ్ చేసేస్తున్నారు. అయినా సరే ఆ సినిమాలకు మంచి ఫలితాలు వస్తున్నాయి. కేజీఎఫ్, లియో లాంటి సినిమాల తర్వాత ప్రభాస్ మూవీ సలార్ కు కూడా ఇలాగే చేశారు. సలార్ కు మినిమం ప్రమోషన్లు కూడా చేయలేదు. అయినా తెలుగు రాష్ట్రాల్లో ఆ సినిమాకు బంపర్ క్రేజ్ వచ్చింది. భారీ ఓపెనింగ్స్ తెచ్చుకుంది.
మిగతా చోట్ల కూడా ఓపెనింగ్స్ బాగానే ఉన్నాయి కానీ, ఓవరాల్ వసూళ్లు మాత్రం ఆశించిన స్థాయిలో లేవు. ముఖ్యంగా ఈ సినిమాకు ఉన్న స్టామినా ప్రకారం హిందీ వర్షన్ ఈపాటికి 300 కోట్ల మార్కును అందుకుని ఉండాలి. ఉత్తరాదిన మాస్ లో ప్రభాస్ కు, అలాగే దర్శకుడు ప్రశాంత్ నీల్ కు మంచి ఫాలోయింగ్, మార్కెట్ ఉన్నాయి. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన యాక్షన్ మూవీ సాహో డివైడ్ టాక్ తోనే భారీ కలెక్షన్లు రాబట్టింది.
ఇక ప్రశాంత్ నీల్ కేజిఎఫ్ రెండు భాగాలతో ఎలాంటి వసూళ్ల మోత మోగించాడో తెలిసిందే. ఇలాంటి కాంబినేషన్లో వచ్చిన మాస్- యాక్షన్ మూవీ ఈజీగా 300-400 కోట్ల వసూళ్లు రాబట్టాలి. కానీ సలార్ అక్కడ ఇప్పటిదాకా 150 కోట్ల మేర మాత్రమే కలెక్షన్లు తెచ్చుకుంది. షారుఖ్ ఖాన్ మూవీ డంకీతో పోటీ పడడం మైనస్సే అయినప్పటికీ.. సలార్ స్టామినా తక్కువేమీ కాదు. డంకీకి నార్త్ ఇండియాలో ప్రమోషన్లు ఒక రేంజ్ లో జరిగాయి.
ఎక్కువ సంఖ్యలో, మంచి మంచి థియేటర్లు పడ్డాయి. ఈ విషయంలో సలార్ కు అన్యాయం జరిగిన మాట వాస్తవం. అయితే సినిమాను ఉత్తరాదిన ప్రభాస్ ఏమాత్రం ప్రమోట్ చేయకపోవడం, రిలీజ్ వ్యవహారాలు దగ్గరుండి చూసుకోకపోవడం మైనస్ అయింది. ప్రభాస్ గత మూడు చిత్రాలకు దక్కిన బ్యాకప్ ఈ సినిమాకు ఉత్తరాదిన దక్కలేదు సంగీతం. మొత్తంగా కారణాలు ఏవైనాప్పటికీ సలార్ గోల్డెన్ ఛాన్స్ మిస్ అయ్యింది అన్నది మాత్రం నిజం.