సీనియారిటీ ఎంత ఉన్నా డిమాండ్ తగ్గని హీరోయిన్లలో త్రిష, సమంతాలు ముందు వరసలో ఉన్నారు. దశాబ్దం దాటినా సరే అవకాశాలు క్యూ కడుతూనే ఉన్నాయి. ఈ ఇద్దరికీ సంబంధించిన ఒక బాలీవుడ్ టాక్ ఆసక్తికరంగా ఉంది. సల్మాన్ ఖాన్ హీరోగా తమిళ దర్శకుడు విష్ణువర్ధన్ తో నిర్మాత కరణ్ జోహార్ భారీ ఎత్తున్న ‘ది బుల్’ అనే ప్యాన్ ఇండియా మూవీ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఓ రెండు మూడు రోజుల్లో రానుంది. 2025 రంజాన్ పండగని లక్ష్యంగా పెట్టుకుని షూటింగ్ చేయబోతున్నారు. హీరోయిన్ కసరత్తే ఇంకా పూర్తవ్వలేదు.
ముందుగా కండల వీరుడికి జోడిగా త్రిషను అనుకున్నారు. కానీ ఆమె అజిత్ కొత్త చిత్రంతో పాటు చిరంజీవి విశ్వంభరకు కమిట్ మెంట్ ఇచ్చేసింది. డేట్లు అంత సులభంగా దొరికేలా లేవు. దీంతో ఇష్టం లేకపోయినా ది బుల్ ని వదులుకున్నట్టు సమాచారం. ఆ స్థానంలో సమంతాని తీసుకునే ప్రతిపాదన జోరుగా సాగుతోందని తెలిసింది. శాకుంతలం డిజాస్టర్, ఖుషి ఎబోవ్ యావరేజ్ ఫలితాలు వచ్చాక చికిత్స కోసం కెరీర్ కు బ్రేక్ తీసుకున్న సామ్ త్వరలో కంబ్యాక్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. సిటాడెల్ వెబ్ సిరీస్ ఇండియన్ వెర్షన్ ప్రమోషన్లతో మొదలుపెట్టి మెల్లగా కథలు వింటుంది.
సామ్ ది బుల్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టేనని అంటున్నారు. సల్మాన్ ఖాన్ అభిమానుల ఆశలన్నీ బుల్ మీదే ఉన్నాయి. కిసీకా భాయ్ కిసీకా జాన్ దారుణంగా డిజాస్టర్ కావడం, టైగర్ 3కి వసూళ్లు వచ్చినా యష్ రాజ్ ఫిలిమ్స్ తీసిన స్పై మూవీస్ లో తక్కువ రెస్పాన్స్ రావడం వాళ్ళను కలవరంలో ముంచెత్తింది. ది బుల్ లో సల్మాన్ చాలా షేడ్స్ లో కనిపించబోతున్నాడు. ఆర్మీ ఆఫీసర్ గా దేశం కోసం ఎంత దూరమైనా వెళ్లేందుకు తెగించే పాత్రలో ఇంటెన్స్ గా డిజైన్ చేశారట. పవన్ కళ్యాణ్ పంజాతో మనకూ పరిచయమున్న విష్ణువర్ధన్ ది బుల్ ని ఎలా రూపొందిస్తాడోనని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.
This post was last modified on January 2, 2024 9:14 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…