ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ భారీ అంచనాలతో ఎదురు చూస్తున్న పుష్ప 2 ది రూల్ విడుదల తేదీ వాయిదా పడిందనే పుకారు ఒక్కసారిగా ఊపందుకుంది. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ అప్పటికి పూర్తి కావని, అందుకే పోస్ట్ పోన్ తప్ప వేరే మార్గం లేదని సుకుమార్ చెప్పేశారని ఏవేవో కథలు అల్లేశారు. రామ్ చరణ్ అభిమానులు ఒక అడుగు ముందుకేసి గేమ్ ఛేంజర్ ని ఆ తేదీకి లాక్ చేసెయ్యమని, మంచి డేట్ కాబట్టి భారీ వసూళ్లు వస్తాయని దిల్ రాజు బ్యానర్ ని ట్యాగ్ చేసి విన్నపాలు చేయడం మొదలుపెట్టారు. అసలు ట్విస్టు ఏంటంటే వాయిదా అనేది పచ్చి గాసిప్పే తప్ప మరొకటి కాదు.
అసలీ న్యూస్ ఎక్కడ మొదలయ్యిందంటే కొందరు పేరున్న బాలీవుడ్ విశ్లేషకులు పుష్ప 2 రాదు కాబట్టి అజయ్ దేవగన్ సింగం అగైన్ కి వసూళ్ల పరంగా మంచి ఛాన్స్ ఉంటుందని వార్తలు వండారు. దీంతో ఖచ్చితమైన సమాచారం ఉండబట్టే అలా రాస్తారని భావించి అదే నిజమనుకున్న జనాలు లేకపోలేదు. దీంతో మెల్లగా ఇది వైరల్ కావడం మొదలయ్యింది. నిన్న నూతన సంవత్సర శుభాకంక్షాలు చెబుతూ పుష్ప టీమ్ వదిలిన గ్రీటింగ్ పోస్టర్ లో చాలా స్పష్టంగా రిలీజ్ డేట్ ఆగస్ట్ 15ని పెద్దక్షరాలతో కుడివైపు చివర్లో పెట్టారు. ఇరవై నాలుగు గంటలు కాక ముందే ఇదిగో ఇలా ఆన్ లైన్ ప్రచారాలు షురూ.
దర్శకుడు సుకుమార్ చేతిలో ఏడు నెలల సమయం అది. జూలైని ప్రమోషన్లు, పోస్ట్ ప్రొడక్షన్ల కోసం వాడుకున్నా బాలన్స్ షూటింగ్ ని దానికన్నా ముందే నిక్షేపంగా పూర్తి చేస్తారు. నిజానికి వేసవిలోనే గుమ్మడికాయ కొట్టేస్తారట. ఆపై కొంత టైం చేతిలో ఉంచుకుంటే ఇతరత్రా ఒత్తిళ్లు తగ్గించుకోవచ్చని అలా ప్లాన్ చేసుకున్నారు. రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్, అనసూయ, సునీల్ లాంటి బిజీ ఆర్టిస్టులు ఉండటం వల్ల కాల్ షీట్స్ బాలన్స్ చేయడం కొంచెం ఇబ్బందే అయినప్పటికీ పుష్ప 2 ఎట్టి పరిస్థితుల్లో ఇండిపెండెన్స్ డే మిస్ కాదు. వెయ్యి కోట్లకు పైగా బిజినెస్ ని టార్గెట్ చేసుకున్నాడు పుష్పరాజ్.
This post was last modified on January 2, 2024 4:43 pm
ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…
గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…
కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…