ఇంకో పది రోజుల్లో విడుదల కాబోతున్న గుంటూరు కారం తర్వాత దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎవరితో సినిమా చేస్తారనే విషయంలో ఊహాగానాలు ఎక్కువయ్యాయి. ఒకరేమో వెంకటేష్-నాని కాంబోలో మల్టీ స్టారర్ అంటారు. ఇంకొకరేమో మొన్న ఈవెంట్ లో ఏదో మాట వరసకు చెప్పుకున్న వెంకీ చిరంజీవి కలయికలో అంటారు. కానీ నిజమేంటో ఎవరికీ క్లారిటీ లేదు. ఇన్ సైడ్ టాక్ ఏంటంటే త్రివిక్రమ్ ప్రస్తుతం మూడు కథల మీద వర్క్ చేస్తున్నారు కానీ ఆయన ధ్యాస ప్రధానంగా అల్లు అర్జున్ తో చేయబోయే ప్యాన్ ఇండియా మూవీ మీదే ఉంది. ఆ స్క్రిప్ట్ ని ముందు ఒక కొలిక్కి తేవాలి.
గుంటూరు కారం లాంటి కమర్షియల్ సినిమాకు ఇంత జాప్యం జరగడం ఆయన్ను ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం. కారణాలు ఏమైనా, మార్పులు,చేర్పులు , గ్యాపులు రాకపోయి ఉంటే ఆరు నెలల క్రితమే సిద్ధమవ్వాల్సిన అవుట్ ఫుట్ ఇది. కానీ రిలీజ్ కు పది రోజుల ముందు కూడా పాట షూట్ లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అలాంటిది బన్నీతో ప్రాజెక్టుకి ఇలాంటివి కుదరవు. అన్నీ పర్ఫెక్ట్ గా ఉండాలి. పైగా మొదటిసారి త్రివిక్రమ్ నేషనల్ మార్కెట్ ని టార్గెట్ చేస్తున్నారు. ప్రతిదీ క్యాలికులేటెడ్ గా సుకుమార్, సందీప్ వంగా తరహా స్టాండర్డ్ లో సెట్ చేసుకోవాలి.
అలాంటప్పుడు తాపీగా ఇంకో సినిమా చేసేంత తీరిక ఆయనకు లేదని సన్నిహితుల నుంచి వినిపిస్తున్న మాట. అనూహ్యంగా ఏదైనా జరిగి ఒకవేళ బన్నీ కనక ఆలస్యం చేస్తే తప్ప పైన చెప్పిన కాంబో కానీ లేదా పూర్తిగా వేరే మూవీ కానీ ఉండకపోవచ్చని అంటున్నారు. గుంటూరు కారం ప్రమోషనల్ ఇంటర్వ్యూలలో దీని గురించిన ప్రస్తావన ఖచ్చితంగా వస్తుంది. యాంకర్ అడగకుండా ఉండరు. అప్పుడు త్రివిక్రమ్ సమాధానం చెబుతారో లేక దాటవేసి ఆగమంటారో వేచి చూడాలి. అల వైకుంఠపురములో తర్వాత ఏకంగా నాలుగేళ్ల గ్యాప్ రావడంతో గుంటూరు కారం మీద ఫ్యాన్స్ అంచనాలు మాములుగా లేవు.
This post was last modified on January 2, 2024 3:13 pm
యావత్తు దేశం ఆసక్తిగా ఎదురు చూస్తున్న వక్ఫ్ సవరణ చట్టంపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. భారత…
నేను లోకల్, ధమాకా దర్శకుడు త్రినాధరావు నక్కిన ఇవాళ జరిగిన చౌర్య పాఠం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడుతూ…
భారత్ నుంచి పరారైపోయిన ప్రముఖ వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీకి సంబంధించి రోజుకో కొత్త తరహా వింతలు, విశేషాలు వెలుగు…
తాజాగా మరో రాజ్యసభ సీటుకు సంబంధించి ఎన్నికలకు రంగం రెడీ అయింది. వైసీపీ నాయకుడు, కీలక నేతల వేణుంబాకం విజయ…
ఇటీవలే విడుదలైన రవితేజ మాస్ జాతర పాటలో స్వర్గీయ చక్రి గొంతు విని సంగీత ప్రియులు ఆశ్చర్యపోయారు. అభిమానులు భావోద్వేగానికి…