భారీ అంచనాల మధ్య గత నెల 22న విడుదలైన సలార్ పది రోజుల రన్ పూర్తి చేసుకుంది. మొదటి మూడు రోజుల తరహాలో ప్రొడక్షన్ హౌస్ నుంచి అఫీషియల్ ఫిగర్స్ రావడం లేదు కానీ ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు సలార్ ఇప్పటిదాకా వసూలు చేసిన గ్రాస్ 520 నుంచి 540 కోట్ల మధ్యలో ఉంది. షేర్ రూపంలో ఇది సుమారు 300 కోట్లకు దగ్గరగా ఉంటుంది. నిన్న వీకెండ్ మంచి హోల్డ్ కొనసాగించిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ మరీ అద్భుతంగా పికప్ చూపించలేదు కానీ మెయిన్ సెంటర్స్ లో హౌస్ ఫుల్ బోర్డులు పడ్డాయి. ఇవాళ న్యూ ఇయర్ రోజు కూడా సోల్డ్ అవుట్స్ ఎక్కువున్నాయి
ఏపీ తెలంగాణలో పెంచిన టికెట్ల రేట్ల స్థానంలో పాత ధరలు అమలులోకి తేవడంతో మిస్సైన ప్రేక్షకులకు ఇప్పుడు సాధారణ రేట్లకే చూసే వెసులుబాటు వచ్చేసింది. ఇది సానుకూలంగా కనిపిస్తోంది. అయితే వెయ్యి కోట్ల మార్కు అసాధ్యమైనే క్లారిటీ మెల్లగా వస్తోంది. కేవలం ఇంకో పది రోజుల్లో సంక్రాంతి హడావిడి మొదలైపోతుంది. గుంటూరు కారం, హనుమాన్ లు ముందు బరిలో దిగుతాయి. సలార్ ని ఖాళీ చేయాల్సి ఉంటుంది. ప్రధాన కేంద్రాలు ఒకటి రెండు కొనసాగించే అవకాశాలు పెద్దగా లేవు. మైత్రి డిస్ట్రిబ్యూషన్ కాబట్టి సలార్ స్క్రీన్లు ఎక్కువ హనుమాన్ కు వెళ్తాయి.
ఏది చేసినా రాబోయే జనవరి 11 లోపే చేసేయాలి. చూస్తుంటే రజనీకాంత్ జైలర్ నెలకొల్పిన మైలురాయి దాటడం కూడా కష్టమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జైలర్ 625 కోట్లకు వసూళ్లతో దూరంలో ఉంది. దీన్ని దాటాలంటే సలార్ ఇంకో వంద కోట్లకు పైగానే రాబట్టాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత సులభంగా కనిపించడం. కెజిఎఫ్ ని మించి ఆడుతుందనుకున్న డార్లింగ్ ఫ్యాన్స్ కోరిక నెరవేరేలా లేదు. కాకపోతే నిరాశపరచకుండా సలార్ 2కి అవసరమైన బజ్ ని సృష్టించడంలో పార్ట్ 1 సక్సెస్ అయ్యింది. డంకీ పోటీ లేకపోతే హిందీ వర్గాల్లో ఇంకాస్త మెరుగ్గా ఆడేది కానీ కుదరలేదు.
This post was last modified on January 1, 2024 6:49 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…