సంక్రాంతి సినిమాలు దేనికవే ప్రమోషన్లలో బిజీగా ఉన్నాయి. మరోవైపు నిర్మాతలు, బయ్యర్లు వీలైనన్ని ఎక్కువ థియేటర్లను బ్లాక్ చేసుకునే పనిలో పడ్డాయి. ముఖ్యంగా బిసి సెంటర్లలో ఇదో పెద్ద సమస్యగా మారిపోయింది. అంచనాల పరంగా వరస క్రమం పేర్చుకుంటూ పోతే ఈగల్ స్థానం కిందకు వెళ్తుండటం రవితేజ అభిమానులను కలవరపెడుతోంది. టీమ్ క్రమం తప్పకుండ లిరికల్ వీడియోలు, ఇంటర్వ్యూలు, ఈవెంట్లు చేస్తోంది. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని చిత్రానికి సంబంధించిన కీలక విషయాలు పంచుకుంటూ బజ్ ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. రవితేజ తోడ్పాటు చాలా ఉంది.
ఇంతా చేసి గ్రాండ్ రిలీజ్ దక్కకపోతే కష్టం. ఓపెనింగ్స్ ఏ మాత్రం తగ్గినా లెక్కల పందెంలో వెనుకబడిపోతుంది. మాములుగా మాస్ మహారాజా బొమ్మంటే సి సెంటర్లోనూ స్క్రీన్ దొరుకుతుంది. కానీ ఈసారి ఆ పరిస్థితి లేదని ట్రేడ్ టాక్. ఉదాహరణకు తూర్పుగోదావరి జిల్లా అంగరలో రెండు థియేటర్లే ఉన్నాయి. ఒకటి గుంటూరు కారం, మరొకటి సైంధవ్ కు ఇచ్చేశారు. కర్నూలు జిల్లా కోడుమూరులో కూడా ఇదే పరిస్థితి. ఇలాంటివి లెక్కబెట్టుకుంటూ పోతే పదుల సంఖ్యలో తేలుతాయి. నా సామిరంగ, హనుమాన్ లకు సైతం ఇక్కడ చోటు దక్కలేదు. పోటీ విపరీతంగా ఉంటే వచ్చే నష్టం ఇది.
అన్ని విధాలుగా ఈగల్ రెక్కలు విదిలించాల్సిన అవసరం వచ్చేసింది. అసలే రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు ఫ్లాపుల తర్వాత వస్తున్న సినిమా. ఫ్యాన్స్ ఎలాగైనా బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నారు. తీరా చూస్తే కాంపిటీషన్ ఇంత క్లిష్టంగా ఉంది. జనవరి 26కి వెళ్తే బాగుంటుందన్న కామెంట్లను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సీరియస్ గా తీసుకోలేదు. ఒకవేళ ఈగల్ ఎంత గొప్పగా ఉన్నా అది వీలైనంత ఎక్కువ శాతం ఆడియన్స్ కి చేరకపోతే రిజల్ట్ మీద ప్రభావం పడుతుంది. మాస్ జనాల ఆప్షన్లలో ఈగల్ ముందు వరసలోకి రావాలంటే ఇంకేదో మేజిక్ జరగాలి. టీమ్ ప్లాన్స్ ఎలా ఉన్నాయో చూడాలి.
This post was last modified on January 1, 2024 6:47 pm
రాయలసీమలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రముఖ…
దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…
సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…
ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…
కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…
ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…