ఎన్నో ఆశలతో కొండంత లక్ష్యాలతో కొత్త సంవత్సరం మొదలైపోయింది. ముఖ్యంగా ఇండియన్ సినిమాని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తున్న టాలీవుడ్ కి ఈ ఏడాది అత్యంత కీలకంగా మారబోతోంది. వందల కోట్ల బడ్జెట్ తో రూపొందిన స్టార్ హీరోల చిత్రాలు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ని తలదన్నేలా అన్ని బాషల పరిశ్రమలకు సవాల్ విసరబోతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర’ మీద ఇప్పటికే అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పనక్కర్లేదు. విడుదలకి చాలా సమయం ఉన్నప్పటికీ అల్లు అర్జున్ ‘పుష్ప 2 ది రూల్’ రికార్డుల గురించి అప్పుడే వివిధ వర్గాల్లో చర్చలు మొదలైపోయాయి.
సుదీర్ఘ కాలంగా నిర్మాణంలో ఉన్న రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ సెప్టెంబర్ లో రావడం ఖాయమని దిల్ రాజు చెప్పడం అభిమానుల్లో ఉత్సాహాన్ని తెచ్చి పెట్టింది. ప్రభాస్ ‘కల్కి ఏడి 2898’ ఫిలిం మేకింగ్ లో సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. నిఖిల్ ‘స్వయంభు’ ని హిస్టారికల్ గా రూపొందిస్తున్నారు. చిరంజీవి ‘విశ్వంభర’ విజువల్ ఎఫెక్ట్స్ తో ఫాంటసీ జానర్ లో భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ‘ఓజి’ డేట్ లాక్ చేయలేదు కానీ రావడం దాదాపు ఖాయమే. అడవి శేష్ ‘గూఢచారి 2’, నాని ‘సరిపోతుందా శనివారం’ లు బహు భాషలను టార్గెట్ చేసుకున్నావే.
ఇవి కాకుండా బాలయ్య 109, ఫ్యామిలీ స్టార్, టిల్లు స్క్వేర్ మొదలైనవి అన్ని లాంగ్వేజెస్ లో కాకపోయినా రేంజ్ పరంగా ఏ మాత్రం పైవాటికి తగ్గని హైప్ తో రాబోతున్నాయి. డబ్బింగ్, రీమేక్, శాటిలైట్, ఓటిటి మార్కెట్లు కొంత కుదేలుకు గురైనప్పటికీ ఈసారి పరిస్థితిలో చాలా మార్పు వస్తుందని అగ్ర నిర్మాతలు అంచనా వేస్తున్నారు. బాలీవుడ్ ని మనం ఎప్పుడో మించి పోయామని, రాబోయే రోజుల్లో పూర్తి ఆధిపత్యం చెలాయించే దిశగా మన దర్శకులు సృష్టిస్తున్న అద్భుతాలు బాక్సాఫీస్ లెక్కలను మారుస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తెలుగు సినిమాని అభిమానించే ప్రతిఒక్కరు కోరుకునేది కూడా ఇదే.
This post was last modified on January 1, 2024 11:25 am
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…