పవన్‍కళ్యాణ్‍తో గబ్బర్‍సింగ్ తీసిన హరీష్ శంకర్‍కి పవన్ ఫాన్స్ పల్స్ బాగా తెలుసు. అతడిని ఎలా చూపిస్తే ఫాన్స్కి పూనకాలు వస్తాయో తెలుసు కనుకే ‘గబ్బర్‍సింగ్’ని ఆ రేంజ్‍లో చూపించగలిగాడు. అప్పుడంటే పవన్‍కళ్యాణ్ ఒక పవర్‍స్టార్ మాత్రమే. కానీ ఇప్పుడు ఒక పార్టీకి అధినేత. అందుకే ఇప్పుడు పవన్‍ని కేవలం ఒక సినిమా హీరోలా కాకుండా ఐడియల్ పర్సన్‍లా చూపించాలి. అందుకే హరీష్ శంకర్ తన హీరో పాత్రను నేతాజీ, సర్దార్ ఆలోచనలు, ఆచరణ వున్న క్యారెక్టర్‍లా తీర్చిదిద్దాడు.
కాన్సెప్ట్ పోస్టర్‍లో ఇది కేవలం వినోదాత్మక చిత్రం కాదని హరీష్ స్పష్టం చేసాడు. అలా అని హరీష్ శంకర్ కమర్షియల్ మీటర్ దాటి ఆలోచించే టైప్ కాదు. చిరంజీవి చేసిన ఠాగూర్ లాంటి ఐడియలిస్టిక్ క్యారెక్టర్‍ని గబ్బర్‍సింగ్ తరహా మాస్ లక్షణాలతో హరీష్ చూపించబోతున్నాడు. తన హీరోకి రొమాంటిక్ కోణం కూడా వుంటుందని ఎర్ర గులాబీతో చెప్పకనే చెప్పాడు. ఇలాంటి హీరో ఏదో పాత తరహా స్టయిల్లో కాకుండా స్టయిలిష్ బైక్ నడుపుతాడని కూడా చెప్పేసాడు.
వకీల్‍సాబ్ మోషన్ పోస్టర్‍తో కూడా ఫాన్స్కి ఎలాంటి గూస్‍బంప్స్ ఇవ్వలేకపోయింది కానీ హరీష్ శంకర్ మాత్రం అసలు పవన్ ఫోటో లేకుండానే వారికి ఫుల్ కిక్ ఇచ్చేసాడు. ఈ సినిమాను త్వరగా మొదలు పెట్టాలంటూ ఫాన్స్ ట్వీట్ విన్నపాలతో పవన్‍కళ్యాణ్ ట్విట్టర్ హ్యాండిల్‍ని స్పామ్ చేసేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates