ఈ నెల 29న విడుదల కాబోతున్న కళ్యాణ్ రామ్ డెవిల్ కు పెద్ద అండ దొరికింది. ఆంధ్రకు సంబంధించిన థియేట్రికల్ హక్కులను దిల్ రాజు స్వంతం చేసుకున్నారనే వార్త అభిమానులకు ఉత్సాహాన్ని ఇచ్చింది. నిజానికి 22న సలార్ ఉండటంతో డెవిల్ కు సరిపడా థియేటర్లు దొరుకుతాయో లేదోననే అనుమానం జనాల్లో ఉంది. ఒకవేళ ప్రభాస్ కనక బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంటే కనీసం రెండు వారాల పాటు ఆ ప్రభంజనాన్ని తట్టుకోవడం కష్టం. ఎవరు వచ్చినా నిలవలేరు. అయినా సరే దర్శక నిర్మాత అభిషేక్ నామా కంటెంట్ మీద నమ్మకంతో సాహసం చేసి రిస్క్ కి సిద్ధపడ్డారు.
ఇప్పుడు దిల్ రాజు అండ దొరికింది కాబట్టి సమస్య తగ్గిపోతుంది. ఆయన ఆధ్వర్యంలో నడిచే స్క్రీన్లలో అవసరమైనన్ని డెవిల్ కి వచ్చేలా చేయొచ్చు. ఎలాగూ సలార్ అప్పటికి మొదటి వారం పూర్తి చేసుకుని ఉంటుంది. హిట్ అయినా ఇబ్బంది లేకుండా చూసుకోవచ్చు. డెవిల్ అవుట్ ఫుట్ చూశాకే ఈ నిర్ణయం తీసుకున్నారని ఫిలిం నగర్ టాక్. జనవరి 12 దాకా రెండు వారాల గ్యాప్ దొరుకుతుంది కాబట్టి అప్పటిదాకా కళ్యాణ్ రామ్ కనక పాజిటివ్ టాక్ తో నెట్టుకొస్తే బింబిసారలాగా సూపర్ హిట్ ని ఖాతాలో వేసుకోవచ్చు. గత ఏడాది విపరీతమైన పోటీలో దీన్ని కొని భుజం తట్టింది దిల్ రాజే.
ట్రైలర్ ఎలాగూ అంచనాలు పెంచేసింది. సోషల్ మీడియా ప్రస్తుతం సలార్ నామజపం చేస్తోంది కాబట్టి దాని ఊపు కొంత తగ్గాక డెవిల్ గురించి హడావిడి మొదలవుతుంది. యానిమల్ కు అద్భుతమైన స్కోర్ ఇచ్చిన హర్షవర్ధన్ రామేశ్వర్ నేపధ్య సంగీతం డెవిల్ లో ఏ మేరకు మేజిక్ చేసిందనే దాని మీద ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. టాలీవుడ్ లో చేసిన సినిమాలన్నీ హిట్టు కొట్టిన సంయుక్త మీనన్ ఈ డెవిల్ కు మరో లక్కీ ఫ్యాక్టర్ గా ఉపయోగపడుతోంది. బ్రిటిష్ కాలం నాటి పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో క్రైమ్, గూఢచర్యం, దేశభక్తి ఈ మూడు మిక్స్ చేసి డెవిల్ ని తీశారు. కళ్యాణ్ రామ్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.
This post was last modified on December 16, 2023 7:06 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…