ఇద్దరు అతి పెద్ద స్టార్లు స్క్రీన్ షేర్ చేసుకుంటే అంతకంటే కిక్ అభిమానులకు వేరొకటి ఉండదు. కాకపోతే ఫుల్ లెన్త్ సాధ్యపడకపోయినా కనీసం అతిథి రూపంలో తీరితే అయినా సంతోషిస్తారు. 2011లో వచ్చిన షారుఖ్ ఖాన్ ప్యాన్ ఇండియా మూవీ రా వన్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ రోబో గెటప్ లో అది కొద్ది నిముషాలు మాత్రమే కనిపించే స్పెషల్ క్యామియో చేశారు. నిజానికి ఆ సీన్ ని డూప్ తో చేసినా వర్కౌట్ అయ్యేది కానీ బాద్షా కోరికని మన్నించిన తలైవా అదే పనిగా ఒరిజినల్ గెటప్ వేసుకుని మరీ నటించారు. అంత స్నేహం వీళిద్దరి మధ్య ఉంది. తర్వాత మళ్ళీ సాధ్యపడలేదు.
ఖైదీ, మాస్టర్, లియో ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా నటించబోయే సినిమాలో షారుఖ్ కోసం ఒక ప్రత్యేక పాత్రను డిజైన్ చేశారట. స్టోరీ లైన్ కూడా వినిపించి సానుకూల స్పందన తెచ్చుకున్నట్టు చెన్నై టాక్. అయితే ఫైనల్ వెర్షన్ అయ్యాక నిర్ణయం తీసుకుందామని అనుకోవడంతో ప్రస్తుతానికి కన్ఫర్మ్ గా చెప్పలేం. ఒకవేళ నిజమైతే మాత్రం పదమూడు సంవత్సరాల తర్వాత ఈ కలయికని స్క్రీన్ మీద చూసినట్టు అవుతుంది. జైలర్ బ్లాక్ బస్టర్ తర్వాత హుషారు మీదున్న రజని ప్రస్తుతం వెట్టయన్ (వేటగాడు) చేస్తున్న సంగతి తెలిసిందే. నిన్నే టీజర్ వచ్చింది.
షారుఖ్ గతంలో కమల్ హాసన్ హే రామ్ లో చాలా ముఖ్యమైన పాత్ర పోషించాడు. మంచి ప్రశంశలు వచ్చాయి. కోలీవుడ్ లెజెండ్ తో నటించిన జ్ఞాపకం ఈ రూపంలో ఉండగా ఇప్పుడు రజినితో చేస్తే ఇంకో మెమరీ శాశ్వతం అయిపోతుంది. అన్నట్టు షారుఖ్ ఈ మధ్య దక్షిణాది హీరోలతో నటించేందుకు ఉత్సాహం చూపిస్తున్నాడు. విజయ్ కాంబినేషన్ తో దర్శకుడు ఆట్లీ కనక కథను సిద్ధం చేస్తే వెంటనే చేద్దామని ఆల్రెడీ మాట కూడా ఇచ్చాడు. ఇంకో అయిదారు నెలల్లో దానికి సంబంధించిన క్లారిటీ కూడా వచ్చేస్తుంది. డిసెంబర్ 22 విడుదల కాబోతున్న డంకీ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
This post was last modified on December 13, 2023 7:40 pm
ప్రతిష్ఠాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్కు ముందు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనకు…
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీ…
అమెరికాలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ఫ్యాన్స్ కోసం లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వనప్పటికీ…
ఇంకా సెట్స్ పైకి వెళ్లకుండానే జూనియర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందబోయే ప్యాన్ ఇండియా మూవీ మీద…
కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ నాయకుడు బండి సంజయ్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం తో కాంగ్రెస్ దోస్తీ…