విక్టరీ వెంకటేష్ తొలిసారి డిజిటల్ డెబ్యూ చేసిన రానా నాయుడు కంటెంట్ మీద ఎన్ని విమర్శలు వచ్చాయో అభిమానులు అంత సులభంగా మర్చిపోలేదు. ఎంత అడల్ట్స్ ఓన్లీ అని ముందే చెప్పినా సరే వెంకీ మీద నమ్మకంతో ట్రై చేసిన ఫ్యామిలీ ఆడియన్స్ పూర్తి షో చూడలేక కట్టేసిన దాఖలాలు చూశాం. దగ్గుబాటి హీరోకి మన దగ్గరున్న కుటుంబ ఇమేజ్ అలాంటిది కాబట్టి ఆ ఫీలింగ్ వచ్చి ఉండొచ్చు కానీ బయట ఆ సమస్య లేదుగా. అందులోనూ నెట్ ఫ్లిక్స్ వివిధ భాషల్లో వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ చేయడంతో దానికి తగ్గట్టే ఒక అరుదైన రికార్డు రానా నాయుడు ఖాతాలో వచ్చి చేరింది.
నెట్ ఫ్లిక్స్ ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు స్ట్రీమింగ్ చేసిన ప్రపంచవ్యాప్త టాప్ 400 వెబ్ కంటెంట్ నుంచి ఇండియా తరఫున ఒక్క రానా నాయుడు మాత్రమే అందులో చోటు సంపాదించుకుంది. 1 కోటి 64 లక్షల వ్యూయింగ్ అవర్స్ (వీక్షించిన గంటలు)తో 336వ స్థానాన్ని సొంతం చేసుకుంది. ఎవరినైతే లక్ష్యంగా పెట్టుకుని తీశారో ఆ టార్గెట్ పూర్తిగా నెరవేరినట్టే కనిపిస్తోంది. ఇదే ప్లాట్ ఫార్మ్ లో ఇంతకన్నా హిట్ అనిపించుకున్న షీ సీజన్ 2 లాంటివి వెనుకబడటం గమనార్హం. 812 మిలియన్ల గంటలతో అమెరికన్ థ్రిల్లర్ ది నైట్ ఏజెంట్ అగ్ర స్థానాన్ని అలంకరించింది. తర్వాత వెడ్నెస్ డే లాంటివి ఉన్నాయి.
మారుతున్న జనాల అభిరుచులకు అనుగుణంగా స్టార్ హీరోలు కనక వెబ్ సిరీస్ లు చేస్తే ఆదరణ ఉంటుందని రానా నాయుడు ఋజువు చేసింది. వెంకటేష్ ఇటీవలే సీజన్ 2 విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ఫస్ట్ పార్ట్ ఇలా చేసావేంటని కొందరు నన్ను అడగటం ఆలోచనలో పడేసిందని చెప్పడం చూస్తే డోస్ తగ్గించే సూచనలు స్పష్టంగా ఉన్నాయి. రానా నాయుడు 2 ఇంకా షూటింగ్ మొదలుకాలేదు. జనవరి చివరి వారంలో స్టార్ట్ చేయొచ్చు. వెంకీ ముందు ఒక్క సీజన్ చాలనుకున్నారు కానీ తక్కువ టైంలో వచ్చిన స్పందన చూసి మనసు మార్చుకుని సీక్వెల్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.
This post was last modified on December 13, 2023 1:25 pm
తెలంగాణ హనుమకొండలోని అదాలత్ సెంటర్ వద్ద దారుణ ఘటన చోటుచేసుకుంది. పట్టపగలే అందరూ చూస్తుండగానే ఓ ఆటోడ్రైవర్‌ను కత్తితో దాడి…
జాతీయ పురాతన పార్టీ కాంగ్రెస్‌లో అంతర్గతంగా భారీ కలకలం రేగినట్టు తెలుస్తోంది. ఇద్దరు కీలక నాయకుల మధ్య వివాదాలు తారస్థాయికి…
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్‌లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…