ప్రభాస్ సలార్ కు పోటీగా ఉండటంతో షారుఖ్ ఖాన్ డంకీ మీద తెలుగు ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఉన్నారు. అసలే పఠాన్, జవాన్ ఇలా రెండు వెయ్యి కోట్ల బ్లాక్ బస్టర్ల తర్వాత చేస్తున్న మూవీ కావడం వల్ల అంచనాలు మాములుగా లేవు. క్లాసిక్ డైరెక్టర్ గా అపజయమే ఎరుగని రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో రూపొందిన ఈ ఎమోషనల్ కం కామెడీ డ్రామాలో తాప్సీ పన్ను హీరోయిన్ గా నటించింది. ఇవాళ ట్రైలర్ విడుదల చేశారు. సలార్ కన్నా ఒక్క రోజు ముందు డిసెంబర్ 21 థియేటర్లలో అడుగు పెడుతున్న డంకీ కథా కమామీషు ఏంటో మూడు నిమిషాల వీడియోలో స్పష్టంగా చెప్పేశారు.
ఇది 1995లో మొదలయ్యే కథ. హర్దయాల్ సింగ్ దిల్లాన్ అలియాస్ హార్డీ(షారుఖ్ ఖాన్) లాల్టూ పట్టణంలో అడుగు పెట్టక నలుగురు స్నేహితులు తోడవుతారు. ఓ అమ్మాయి మను(తాప్సి పన్ను) మనసు దోచుకుంటుంది. వీళ్ళ లక్ష్యం ఆంగ్ల బాష నేర్చుకుని లండన్ వెళ్లి జీవనోపాధి చూసుకోవడం. అయితే కుటుంబ పరిస్థితులతో పాటు ఇంగ్లీష్ వంటబట్టించుకోవడంలో తీవ్ర సమస్యలు తలెత్తుతాయి. కొన్ని చేదు సంఘటనలు ఎదురవుతాయి . దీంతో ప్రాణాలకు తెగించి చొరబాటు మార్గం ద్వారా చేరుకోవాలని నిర్ణయించుకుంటారు. అక్కడి నుంచి మొదలవుతుంది అసలు సవాల్.
వినోదం, సందేశం, భావోద్వేగంతో పాటు యాక్షన్ కూడా జొప్పించారు రాజ్ కుమార్ హిరానీ. జవాన్ తరహాలోనే ఇందులో కూడా షారుఖ్ ఖాన్ యువకుడి నుంచి వృద్దుడి దాకా జరిగే పరిణామ క్రమాన్ని ఎమోషనల్ డ్రామాగా చూపించబోతున్నారు. తాప్సి, విక్కీ కౌశల్, బోమన్ ఇరానీ లాంటి టాలెంటెడ్ ఆర్టిస్టులతో సీన్స్ పేలేలా కనిపిస్తున్నాయి. రెగ్యులర్ కమర్షియల్ అంశాలు లేకపోయినా హిరానీ నుంచి ఆశించే ఎలిమెంట్స్ కి ఢోకా లేకుండా డంకీని తీర్చిదిద్దినట్టు అనిపిస్తోంది. సినిమా మొత్తం ఇలాగే ఉంటే మాత్రం బాద్షా ఖాతాలో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ పడ్డట్టే. చూడాలి అంచనాల బరువుని ఏమేరకు మోస్తుందో
This post was last modified on December 5, 2023 12:20 pm
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…