సుధీర్‍ బాబు బ్యాడ్‍ లక్‍!

మహేష్‍బాబు బావమరిది సుధీర్‍ బాబు మొదటి సినిమా రిలీజ్‍ అయినపుడు చాలా కామెంట్లు పడ్డాయి. అతని నటన నుంచి వాయిస్‍ వరకు అన్నీ విమర్శలు ఎదుర్కొన్నాయి. వాయిస్‍ పరంగా వున్న ఇబ్బందిని స్పీచ్‍ కరక్షన్‍తో ఓవర్‍కమ్‍ చేసిన సుధీర్‍ తర్వాత నటుడిగాను మెరుగయ్యాడు.

యాక్షన్‍ హీరోకు కావాల్సిన సూపర్‍ బాడీ, మంచి హైట్‍ వున్నప్పటికీ అతను సాఫ్ట్ సినిమాలే చేసుకుంటూ వచ్చాడు. అతని బాడీ మెచ్చి బాలీవుడ్‍లో టైగర్‍ ష్రాఫ్‍ సినిమాలో విలన్‍గా పెట్టుకున్నారు. తెలుగులో ఇంతవరకు అతనికి యాక్షన్‍ హీరోగా బ్రేక్‍ ఇచ్చే క్యారెక్టర్‍ పడలేదు.

నాని ‘వి’లో తొలిసారిగా సుధీర్‍ బాబుకి యాక్షన్‍ హీరోగా ముద్ర వేసే ఛాన్స్ దక్కింది. ఇది కానీ థియేటర్లలో విడుదలయితే బి, సి సెంటర్లకు రీచ్‍ అవ్వవచ్చునని, తర్వాత విద్యుత్‍ జమావాల్‍ మాదిరిగా యాక్షన్‍ సినిమాలు చేసుకోవచ్చునని సుధీర్‍ ఆశ పడి వుంటాడు. కానీ వి ఓటిటిలో వచ్చేస్తోంది. దీని వల్ల నానికి జరిగే నష్టమేమీ వుండదు. ఎందుకంటే అతనికి ఆల్రెడీ ఒక ఇమేజ్‍ వచ్చేసింది. మళ్లీ సుధీర్‍కి ఇలాంటి పాత్ర ఎప్పటికి పడుతుందో తెలియదు.

ఈ సినిమా థియేటర్ల కోసమే తీసిన సినిమా అని నాని కూడా అంగీకరించాడు. అంటే టీవీలో చూసే స్టఫ్‍ కాకుండా… మాస్‍ విజిల్స్ కొడుతూ పేపర్లు చింపి ఎగరేసే స్టఫ్‍ అన్నమాట. పాపం సుధీర్‍ బ్యాడ్‍ లక్‍ అనుకోవాలంతే!