ఎల్లుండి తెలంగాణ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. సామాన్య ప్రజానీకంతో పాటు దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతుండగా అధికార పార్టీ మాత్రం మళ్ళీ ప్రమాణ స్వీకారం చేసేది మేమేనంటూ ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే ఇక్కడ టాలీవుడ్ టెన్షన్ పడేందుకు ఏముందనే డౌట్ రావడం సహజం. ఒకవేళ ప్రభుత్వం మారాల్సి వస్తే ఇండస్ట్రీ పట్ల దాని దృక్పథం ఎలా ఉండబోతోందనేది టాక్ అఫ్ ది టౌన్ గా మారుతుంది. ఎందుకంటే డిసెంబర్ 22 నుంచి భారీ చిత్రాలు వరసలో ఉన్నాయి. ముఖ్యంగా సలార్ తో.
టికెట్ రేట్ల పెంపు వ్యవహారం చాలా కీలకం కాబోతోంది. బిఆర్ఎస్ వస్తే ఇబ్బంది లేదు. ఎలాగూ పాత సిస్టమ్ కొనసాగుతుంది కాబట్టి ఆటోమేటిక్ గా అనుమతులు వస్తాయి. లేదూ హస్తం గుర్తుకు జనం పట్టం కడితే మాత్రం పర్మిషన్ల తతంగం కొంచెం ఆలస్యం కావొచ్చు. ఏదున్నా రెండు వారాల్లోపే తేలిపోవాలి. తిరిగి సంక్రాంతి పండక్కు అందరూ హైక్ అడగాల్సిందే. గుంటూరు కారంతో మొదలుపెట్టి హనుమాన్ దాకా అందరి బడ్జెట్ రికవరీ కావాలంటే టికెట్లు పెంచుకోవడం తప్ప వేరే ఆప్షన్ లేదు. అందుకే సలార్ దారి చూపిస్తే మిగిలినవి ఫాలో కావడానికి ఛాన్స్ ఉంటుంది.
మహా అయితే నలభై ఎనిమిది గంటల్లో రిజల్ట్ వచ్చేస్తుంది. ఇంకో మూడు నెలలు తిరగడం ఆలస్యం ఆంధ్రప్రదేశ్ లోనూ ఎలక్షన్లు రాబోతున్నాయి. ఈసారి జగన్ ఇంకోసారి వస్తాడా లేక టిడిపి జనసేన కలయికకు సింహాసనం దక్కుతుందానేది మరో ఆసక్తికరమైన అంశం. పాలిటిక్స్ తో సినిమాలకు నేరుగా సంబంధం లేకపోయినా ఎన్నో అవసరాలు ముడిపడి ఉన్నాయి. విధాన నిర్ణయాలు తీసుకోవాల్సింది ప్రభుత్వాలే. సినిమాలు రిలీజ్ రోజు ఎలా అయితే హిట్టా ఫట్టా అనే డిస్కషన్ జరుగుతుందో ఆదివారం ఉదయం నుంచి కౌంటింగ్ కౌంట్ డౌన్ ఆసక్తికరంగా ఉండబోతోంది.
This post was last modified on December 1, 2023 11:01 pm
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…