యానిమల్ చూశాక చాలా మందికి ఎన్నో ముఖ్యమైన డౌట్లు తీరిపోయాయి. ఈ స్క్రిప్ట్ ని మహేష్ వద్దన్నాడనే దాని మీద సోషల్ మీడియా ఫ్యాన్స్ మధ్య పెద్ద చర్చే జరిగింది. దర్శకుడు సందీప్ వంగా స్వయంగా ఓ ప్రెస్ మీట్ లో తాను సూపర్ స్టార్ కి రాసింది దీనికి మించిన డెవిల్ కథని క్లారిటీ ఇవ్వడం చూశాం. అయితే ఇంత వయొలెంట్ కంటెంట్ లో మహేష్ ని ఫ్యామిలీ ఆడియన్స్ రిసీవ్ చేసుకోవడం కష్టం. రానా నాయుడు వెబ్ సిరీస్ లో వెంకటేష్ బూతులు మాట్లాడినందుకే కుటుంబ ప్రేక్షకులు నొచ్చుకున్నారు. దీని దెబ్బకు వెంకీ సెకండ్ సీజన్ ని జాగ్రత్తగా తీస్తామని ఈ మధ్య చెప్పడం తెలిసిందే.
అలాంటిది మహేష్ తో ప్యూర్ అడల్ట్ డైలాగులు చెప్పిస్తే తేడా కొడుతుంది. రన్బీర్ కపూర్ ఇమేజ్, మార్కెట్ వేరు. వాళ్లకు ముందు నుంచి ఇలాంటి కథలు, వ్యవహారాలు అలవాటే. నార్త్ జనాలు రిసీవ్ చేసుకుంటారు. కానీ మన దగ్గర అలా కుదరదు. ఒకవేళ ఇదే యానిమల్ ని సీన్ మార్చకుండా, అక్షరం పొల్లు పోకుండా మహేష్ లేదా ప్రభాస్ చేసి ఉంటే ఖచ్చితంగా నెగటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చేది. అసలే సందీప్ వంగా తాను రాసింది మార్చడానికి, తీసింది కట్ చేయడానికి ఒప్పుకునే రకం కాదు. అలాంటప్పుడు హీరోలు ఇబ్బంది పడటం కన్నా సున్నితంగా నో చెప్పేయడం రైటే.
యానిమల్ చివరి ఫలితం ఇంకా తేలడానికి టైం పడుతుంది కానీ మరీ ఇంత వయొలెంట్ అండ్ పెద్దలకు మాత్రమే కంటెంట్ తో ప్రభాస్ స్పిరిట్ ఉంటే మాత్రం కొన్ని ఇబ్బందులు తప్పవు. అయితే హీరోల ఇమేజ్ దృష్ట్యా అవసరమైన మేరకు మార్పులు కుదింపులు సందీప్ వంగా చేసుకుంటాడు. అర్జున్ రెడ్డి క్లైమాక్స్ ని ముందు హీరోయిన్ వెనక్కు రాకుండా రాసుకున్నాడు. కానీ తెలుగు ప్రేక్షకులు ఇలాంటి ఎండింగ్ ని రిసీవ్ చేసుకోరనే అనుమానంతో మార్చుకున్నాడు. అదే ప్లస్ అయ్యింది. రేపు స్పిరిట్ లో కూడా ఇలాంటి కీలక అంశాలు గుర్తు పెట్టుకుంటాడు. ఆ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ది ఉంటుంది