సినిమాల్లో నటించడంతో స్టార్ హీరోల పని పూర్తవ్వడం లేదు. అసలైన బాధ్యత ఆ తర్వాత మొదలవుతోంది.అదే ప్రమోషన్లు. ఈ విషయంలో అందరూ ఒకేలా ఉండరు. కొందరు కొన్ని ఇంటర్వ్యూలు, ఈవెంట్లతో మమ అనిపిస్తే మరికొందరు రిలీజ్ డేట్ దూరంగా ఉన్నా సరే రోజుల తరబడి పబ్లిసిటీలో భాగమవుతారు. వెంకటేష్, నానిలు ఈ విషయంలో ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నారు. వెంకటేష్ ఇవాళ నుంచి సైంధవ్ ప్రచారంలో దిగిపోయాడు. యువతతో హుషారుగా కలిసిపోతూ వాసులో పాటకు ప్రాణం పల్లవి అయితే సాంగ్ కి స్టెప్పులు వేయడంతో మొదలుపెట్టి వావ్ అంటూ అమ్మాయిలకు జోష్ ఇవ్వడం దాకా కిక్కిస్తున్నాడు.
వీటి వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరలవుతున్నాయి. ఇంత వయసులో వెంకీ ఎనర్జీని చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. ఇక నాని ఒక్కడే హాయ్ నాన్న బాధ్యతను తీసుకుని వెరైటీ ప్రోమోలతో ఆకట్టుకుంటున్నాడు. డమ్మీ ప్రెస్ మీట్ లో కేసీఆర్, లోకేష్ లను అనుకరించడం, వర్తమాన రాజకీయాల మీద సెటైర్లు వేయడం, రివ్యూల మీద పంచులు అబ్బో మంచి హుషారుగా జనాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. సాఫ్ట్ అండ్ ఎమోషనల్ మూవీగా రూపొందిన హాయ్ నాన్న మీద మాస్ కు కూడా ఆసక్తి కలిగేలా నాని చేస్తున్న ఈ విభిన్న ప్రయత్నం ప్రశంసలు అందుకుంటోంది.
వీలైనంత పబ్లిక్ ఎక్స్ పోజర్ ఉండేలా వెంకటేష్, నానిలు ప్లాన్ చేసుకోవడం బాగుంది. సైంధవ్ కి ఇంకా యాభై రోజుల టైం ఉన్నా వెంకీ మాత్రం లైవ్ మోడ్ లోకి వచ్చేశారు. నాని చేతిలో ఉన్నది రెండు వారాలే కావడంతో పాటు హీరోయిన్ మృణాల్ ఠాకూర్ డేట్లు అందుబాటులో లేకపోవడంతో అంతా తన భుజాల మీద మోస్తున్నాడు. గ్యాంగ్స్ అఫ్ గోదావరి, ఆపరేషన్ వాలెంటైన్ వాయిదా సూచనలు ఎక్కువగా ఉన్నాయి. నితిన్ ఎక్స్ ట్రాడినరీ మ్యాన్ హంగామా ఇంకా మొదలుకాలేదు. ఈ అడ్వాంటేజ్ ని నాని ఫుల్ గా వాడుకోవాలని డిసైడ్ అయిపోయి మరీ తిరిగేస్తున్నాడు.
This post was last modified on November 21, 2023 8:47 pm
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…