సల్మాన్ ఖాన్ బిగ్ మిస్టేక్

బాలీవుడ్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్లలో ఒకడైన సల్మాన్ ఖాన్ నుంచి నిఖార్సయిన హిట్ మూవీ వచ్చి చాలా ఏళ్లయింది. ‘సుల్తాన్’ తర్వాత ఏ సల్మాన్ సినిమా కూడా సంతృప్తికర ఫలితాన్నివ్వలేదు. ట్యూబ్ లైట్, రేస్-3, దబంగ్-3, రాధే, కిసి కా భాయ్ కిసీ కి జాన్.. ఇలా అన్నీ డిజాస్టర్లే అయ్యాయి. ఈ పరిస్థితుల్లో తనకు బాగా కలిసొచ్చిన ‘టైగర్’ ఫ్రాంఛైజీ చిత్రం ‘టైగర్-3’ మీద సల్మాన్ ఆశలు పెట్టుకున్నాడు. కానీ ఈ చిత్రం ఆ ఆశల్ని నిలబెట్టేలా కనిపించడం లేదు.

దీపావళి కానుకగా ఆదివారం రిలీజైన ఈ చిత్రానికి డివైడ్ టాక్ వచ్చింది. పండుగ రోజు, పైగా ఆదివారం రిలీజవడంతో ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. ఇండియాలో రూ.45 కోట్ల దాకా గ్రాస్ వసూళ్లు రాబట్టిందీ సినిమా. సల్మాన్ కెరీర్లో ఇదే హైయెస్ట్ డే-1 గ్రాసర్ కావడం విశేషం. ఐతే తొలి రోజు వసూళ్లు చూసి మరీ మురిసిపోవడానికేమీ లేదు.

సల్మాన్ కెరీర్లో హైయెస్టే కానీ.. ఈ ఏడాది బ్లాక్‌బస్టర్లయిన షారుఖ్ సినిమాలు పఠాన్, జవాన్ తొలి రోజు వసూళ్లతో పోలిస్తే ఇవి తక్కువే. దీపావళి పండుగ రోజు, పైగా ఆదివారం రిలీజైన క్రేజీ ఫ్రాంఛైజీ చిత్రానికి ఇంకా మెరుగైన వసూళ్లు రావాల్సింది. అసలు ఆదివారం రోజు రిలీజ్ పెట్టుకోవడం చాలా పెద్ద తప్పు అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ చిత్రాన్ని శుక్రవారం రిలీజ్ చేసి ఉంటే.. తొలి రోజు ఇదే స్థాయిలో ఓపెనింగ్స్ వచ్చేవి.

శని, ఆదివారాల్లో నిలకడగా వసూళ్లు వచ్చేవి. సోమవారం కూడా సెలవే కాబట్టి నాలుగు రోజుల ఎక్స్‌టెండెడ్ వీకెండ్లో భారీగా ఓపెనింగ్స్ రాబట్టుకుని బయ్యర్లను సేఫ్ జోన్లోకి తీసుకెళ్లేది. కానీ ఇప్పుడు సినిమా ఊపు రెండు రోజులకు మించి కొనసాగేలా లేదు. సోమవారం తర్వాత వసూళ్లు ఒక్కసారిగా డ్రాప్ అయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. దీని వల్ల ఓపెనింగ్స్ మీద తీవ్ర ప్రభావం పడుతోంది. డివైడ్ టాక్ వల్ల సినిమాకు లాంగ్ రన్ ఉండే అవకాశాలు కనిపించడం లేదు. ఆదివారం రిలీజ్ పెట్టుకోవడం ‘టైగర్-3’ చేసిన పెద్ద తప్పుగా భావిస్తున్నారు.