Movie News

సలార్ ప్రచారం నిజమేనా రాఖీ భాయ్

సలార్ కౌంట్ డౌన్ ముప్పై ఎనిమిది రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే విపరీతమైన జాప్యం, వాయిదాలతో ఆలస్యమవుతూ వచ్చిన ఈ యాక్షన్ గ్రాండియర్ డిసెంబర్ 22 థియేటర్లలో బులెట్ల వర్షం కురిపించేందుకు సిద్ధమయ్యింది. ప్రభుత్వాలు అనుమతులు ఇస్తే అన్ని చోట్ల ఒకేసారి అర్ధరాత్రి 12 గంటల 22 నిమిషాల 22 సెకండ్లకు ప్రీమియర్లు వేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. టికెట్ రేట్ల పెంపుకి సంబంధించి ఆల్రెడీ ప్రతిపాదనలు పెట్టేశారు. దాదాపు ఖరారు కావొచ్చు. సలార్ కు సంబంధించిన మరో ఆసక్తికరమైన ప్రచారం తిరిగి చక్కర్లు కొట్టడంతో అభిమానుల్లో కొత్త చర్చ మొదలయ్యింది.

సలార్ పార్ట్ వన్ సీజ్ ఫైర్ క్లైమాక్స్ లో కెజిఎఫ్ రాఖీ భాయ్ ఎంట్రీ ఉంటుందని, కనిపించేది కేవలం కొద్దినిమిషాలే అయినా ప్రభాస్, యష్ ఇద్దరూ ఒకే ఫ్రేమ్ లో కనిపించే ఎపిసోడ్ ని దర్శకుడు ప్రశాంత్ నీల్ ఓ రేంజ్ లో సెట్ చేసి ఉంటాడని ఏవేవో ఊహించుకుంటున్నారు. నిజానికి దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు. కెజిఎఫ్ 2 చివర్లో రాఖీ భాయ్ బంగారం మొత్తం సముద్రంలో పారేసే ముందు నడిపే షిప్పులో టైంకి, సలార్ టీజర్ లో చూపించిన ఒక షాట్ కి ముడిపెట్టడం వల్ల ఇలాంటి వెరైటీ విశ్లేషణలు బయటికి వచ్చాయి.

యూనిట్ మాత్రం నిజమా కాదాని చెప్పకుండా ఎలాంటి లీకులు రాకుండా జాగ్రత్త పడుతోంది. ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఇందులో యష్ క్యామియోలాంటిది ఉండకపోవచ్చు. లియోలో రామ్ చరణ్, టైగర్ 3లో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడని వాటి రిలీజ్ కు వారం పది రోజులు  ముందు నుంచి ఎలా అయితే ప్రచారంతో సోషల్ మీడియాని ఊదరగొట్టారో ఇప్పుడు అదే వర్గాలు సలార్ విషయంలోనూ పని చేస్తూ ఉండొచ్చు. నిర్మాతలు, దర్శకుడు వీటిని పట్టించుకునే పరిస్థితిలో లేరు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు అంత ఒత్తిడి మీద జరుగుతున్నాయి. డిసెంబర్ 1న వచ్చే ట్రైలర్ లో పార్ట్ 2 గురించి ఏదైనా క్లూ ఇస్తేనే గొప్పనుకోవచ్చు.

This post was last modified on November 14, 2023 1:31 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

4వ దెయ్యంతో లారెన్స్ రిస్కు!

హారర్ కామెడీ జానర్‌లో ప్రేక్షకులని ఆకట్టుకున్న కాంచన సిరీస్‌లో మరో సినిమా రాబోతోన్న విషయం తెలిసిందే. రాఘవ లారెన్స్ దర్శకత్వం…

38 minutes ago

వైసీపీకి ప్ర‌మోట‌ర్స్ కావ‌లెను… !

ఏపీ ప్రతిప‌క్షం వైసీపీకి ప్ర‌మోట‌ర్స్ కావాలా? పార్టీని ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లే.. వ్యూహాలు ర‌చించ‌డంతోపాటు.. ప్ర‌జ‌ల‌కు పార్టీని చేరువ చేసేందుకు ప్ర‌మోట‌ర్ల…

1 hour ago

ముందు రోజు ప్రీమియర్లు….జెండా ఊపిన బచ్చల మల్లి!

కొత్త సినిమాలకు ముందు రోజు ప్రీమియర్లు వేయడం కొత్త కాకపోయినా ఇది రెండువైపులా పదునున్న కత్తిలా మారడంతో ఉపయోగాలు ఎన్ని…

1 hour ago

చరణ్ భుజాల మీద భారతీయుడి బరువు!

మెల్లగా గేమ్ ఛేంజర్ గేరు మారుస్తోంది. ఇప్పటికే మూడు పాటలు, ఒక టీజర్ వచ్చాయి. ఎల్లుండి జరగబోయే యుఎస్ ప్రీ…

2 hours ago

వైసీపీ హయాంలో వ్యూహం సినిమాకు 2.15 కోట్లు

ఏపీ ఫైబర్ నెట్ సంస్థపై వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక అవకతవకల గురించి ఆ సంస్థ చైర్మన్ జీవీ…

2 hours ago

బేబీని టెన్షన్ పెడుతున్న పుష్ప 2?

బాలీవుడ్ లో అత్యంత వేగంగా 600 కోట్ల గ్రాస్ దాటిన తొలి ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించిన పుష్ప 2…

3 hours ago