Movie News

రెండు డేట్ల మధ్య డంకీ ఊగిసలాట

అనివార్య పరిస్థితుల్లో సలార్ పోటీ వచ్చి పడటంతో షారుఖ్ ఖాన్ డంకీకి పెద్ద చిక్కే వచ్చి పడింది. వెనక్కు తగ్గే ఆలోచన చేయడం లేదు కానీ ప్రమోషన్లలో ఎక్కడా రిలీజ్ డేట్ ని ప్రస్తావించకుండా జాగ్రత్త పడటం అనుమానాలకు తెరతీస్తోంది. డిసెంబర్ 21 రావడం పక్కా అని ఆ మధ్య ఒక పోస్టర్ వదిలారు కానీ తర్వాత వచ్చిన టీజర్ లో ఎక్కడా హైలైట్ చేయలేదు. దీపావళి పబ్లిసిటీలోనూ తేదీ లేదు. మరోవైపు తన గురించి వస్తున్న వాయిదా పుకార్లకు చెక్ పెడుతూ సలార్ బృందం డిసెంబర్ 22 కన్ఫర్మ్ చేస్తూ ట్రైలర్ ని వచ్చే నెల ఒకటిన గ్రాండ్ గా లాంచ్ చేయబోతున్న విషయాన్ని ప్రకటించారు.

బాలీవుడ్ టాక్  ప్రకారం డంకీ ప్రస్తుతం రెండు డేట్ల పరిశీలనలో ఉంది. మొదటిది ఫస్ట్ అనుకున్న డిసెంబర్ 21. దీని వల్ల పెద్ద ఉపయోగం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ స్క్రీన్లలో షోలు వేసుకోవచ్చు. కానీ ముందురోజు ఆక్వామెన్ వచ్చి ఉంటాడు కాబట్టి ఓవర్ సీస్ లో ఇబ్బందులు తలెత్తుతాయి. ఒకవేళ సలార్ కనక బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంటే ఆటోమేటిక్ గా దక్షిణాది థియేటర్ కౌంట్ తగ్గిపోతుంది. ఇది ఇంకా పెద్ద రిస్క్. లేదూ అనుకుంటే డిసెంబర్ 25 మరో మంచి ఆప్షన్. దాని కన్నా ముందు లాంగ్ వీకెండ్ ని పోగొట్టుకోవడం ఎంత వరకు సబబో షారుఖ్ ఖాన్ టీమ్ తీవ్ర విశ్లేషణలో ఉంది.

ఇంకో వారం పది రోజుల్లో దీన్ని తేల్చేయాలి. పంపిణీదారులు వైపు నుంచి ఇప్పటికే ఒత్తిడి ఉందట. సలార్ ట్రైలర్ వచ్చాక ఒక్కసారిగా ప్రమోషన్లను పీక్స్ కు తీసుకెళ్లేలా హోంబాలే ఫిలింస్ ప్లాన్ చేస్తోంది. దానికి ధీటుగా డంకీ ప్రణాళికలు ఉండాలి. ముందైతే అర్జెంట్ గా డేట్ లాక్ చేసుకుంటే తర్వాత ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ప్రభాస్ వర్సెస్ షారుఖ్ పోటీ ఎలా ఉంటుందోననే ఆసక్తి సర్వత్రా వెల్లువెత్తుతోంది. ఒక ఊర మాస్ యాక్షన్ కంటెంట్ కాగా మరొకటి ఎమోషన్ల మీద ఆధారపడ్డ రాజ్ కుమార్ హిరానీ మార్కు ఎంటర్ టైనర్. రెండూ దేనికవే నువ్వా నేనా అని తలపడటం ఖాయం. 

This post was last modified on November 14, 2023 11:18 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

2 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

6 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

7 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

8 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

8 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

9 hours ago