పుష్ప 1 ది రైజ్ ప్యాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టరయ్యాక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రేంజ్ మాములుగా పెరగలేదు. ముఖ్యంగా మార్కెట్ కోణంలో బ్రాండ్ లను ప్రమోట్ చేయడానికి సంస్థలు ఆఫర్ చేస్తున్న మొత్తం కళ్లుచెదిరేలా ఉందని లేటెస్ట్ టాక్. ఒక్క రోజుకు గాను బన్నీ అక్షరాలా 6 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నట్టు ముంబై అప్డేట్. కొన్నేళ్ల క్రితం అరవై లక్షల రేంజ్ లో ఉన్న ధర కాస్తా నేషనల్ అవార్డు వచ్చాక ఇంకా పెరిగిపోయిందని అంటున్నారు. ఇలాంటివి అధికారికంగా చెప్పరు కానీ లీకవుతున్న డిజిటల్ వర్గాల సమాచారం మేరకు వ్యవహారం నమ్మశక్యంగానే ఉంది.
ఒకవేళ ఏదైనా బ్రాండ్ బన్నీని ఉపయోగించుకోవాలనుకుంటే అంత ఫీజు చెల్లించాల్సిందే. సింగల్ కాల్ షీట్లోనే మొత్తం చిత్రీకరణ, ఫోటో షూట్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. అదనంగా ఏదైనా కావాలంటే ఛార్జ్ ఎక్స్ ట్రా. పుష్పకు వచ్చిన రీచ్ చూశాక ఇది న్యాయమైన మొత్తమేనని కార్పొరేట్ కంపెనీలు భావిస్తున్నాయట. బిగ్ బి అమితాబ్ బచ్చనే జీవితంలో ఒక చెప్పు వదిలిన స్టెప్పు ఇంత పాపులర్ కావడం చూడలేదని ఇటీవలే కేబీసీ ప్రోగ్రాంలో అన్న మాట గుర్తుందిగా. దాన్ని నిజం చేస్తూ ముంబై నుంచి ప్రత్యేకంగా ఆఫర్లతో వచ్చి బ్రాండ్లు క్యూ కడుతున్న వైనాన్ని ఎలా తప్పని చెప్పగలం.
ప్రస్తుతం పుష్ప 2 ది రూల్ మీద పూర్తి ఫోకస్ పెట్టిన అల్లు అర్జున్ ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ ల సినిమాల కోసం రెడీ అవుతాడు. వీటిలో ఏది ముందు మొదలవుతుందనేది ఇంకా క్లారిటీ లేదు కానీ గుంటూరు కారం తర్వాత మాటల మాంత్రికుడు ఇంకెవరికి కమిట్ మెంట్లు ఇవ్వలేదు కాబట్టి దాదాపు ఇదే ఫస్ట్ ఉంటుంది. ఒకవేళ కన్ఫర్మ్ అయితే మాత్రం మార్చ్ నుంచే షూటింగ్ మొదలుపెడతారు. ఆగస్ట్ 15 పుష్ప 2 విడుదలకు ముందు రెండు నెలలు బన్నీ పూర్తిగా బ్రేక్ తీసుకుని దాని ప్రమోషన్ కోసం వివిధ రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ టూర్ చేయబోతున్నాడు.
This post was last modified on November 13, 2023 11:15 pm
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…
గత ప్రభుత్వంలో కాకినాడ సీ పోర్టు.. సెజ్ చేతులు మారిన సంగతి తెలిసిందే. అయితే.. తన నుంచి బలవంతంగా పోర్టును…
ఈ మధ్య మన తెలుగు సినిమాలు జపాన్, చైనా లాంటి దేశాల్లో బాగా ఆడుతున్నాయి. ఆర్ఆర్ఆర్ కు దక్కిన ఆదరణ…
మానవాళి చరిత్రలో అనూహ్య ఘటన ఒకటి చోటు చేసుకోనుంది. మారథాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐదు…
నారా లోకేశ్… ఇప్పటిదాకా మనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఏపీ కేబినెట్ లో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రిగా……
అగ్ర రాజ్యం అమెరికాకు 47వ అధ్యక్షుడిగా ఆ దేశ ప్రముఖ వ్యాపారవేత్త డొనాల్డ్ జే ట్రంప్ రెండు రోజుల క్రితం…