డిసెంబర్ 22 విడుదల గురించి బోలెడంత చర్చ జరుగుతుండగానే సలార్ షూటింగ్ ఇంకోవైపు నిర్విరామంగా జరిగిపోతోంది. రామోజీ ఫిలిం సిటీలో ప్రత్యేకంగా వేసిన సెట్ లో ఒక స్పెషల్ సాంగ్ తీస్తున్నారని లేటెస్ట్ అప్ డేట్. ఇందులో నర్తిస్తోంది సిమ్రత్ కౌర్. నాగార్జున బంగార్రాజులో ఒక చిన్న క్యామియో చేసింది. అంతకు ముందు ప్రేమతో మీ కార్తీక్, పరిచయం, డర్టీ హరి చేసింది కానీ అవి ఆశించినంత పేరు తీసుకురాలేదు. సన్నీ డియోల్ గదర్ 2లో ముస్కాన్ గా నటించాక వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు డార్లింగ్ ప్యాన్ ఇండియా మూవీ కాబట్టి ఒక్క పాటకైనా ఓకే చెప్పినట్టు ఉంది.
ఈ పాట గురించి ఇంతకు ముందే లీక్ వచ్చింది కానీ డాన్స్ చేయబోయే హీరోయిన్ ఎవరో లీక్ కాలేదు. ఫైనల్ గా దానికి చెక్ పడినట్టే. అయితే ప్రభాస్ ఉంటాడా లేక కెజిఎఫ్ తమన్నా తరహాలో హీరోని చూపించి చూపించకుండా మేనేజ్ చేస్తారా అనేది వేచి చూడాలి. ఇంకొంత ప్యాచ్ వర్క్ ఈ నెలాఖరులోపు అయిపోతుందట. ఇక కత్తిరింపులు విషయానికి వస్తే ప్రభాస్, పృథ్విరాజ్ సుకుమారన్ చిన్ననాటి ఎపిసోడ్స్ ని ప్రశాంత్ నీల్ ఇప్పుడు అవసరం లేనివిగా ఫీలవుతున్నాడట. అవి కొంత ల్యాగ్ కి గురయ్యాయని, కొంత భాగం తగ్గిస్తే ప్రేక్షకులు బోర్ గా ఫీలవ్వరని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.
రషెస్ ఎప్పటికప్పుడు చూసుకుంటూ వచ్చిన నీల్ ఎడిటింగ్ లో పెద్ద కోతే వేశారని బెంగళూరు టాక్. దీని వల్ల నిర్మాతలకు కోట్లలో నష్టం వచ్చినా సరే క్వాలిటీ కోసం రాజీ పడలేదని అంటున్నారు. అయితే గత రెండు రోజులుగా సలార్ బిజినెస్ వ్యవహారాల గురించి మీడియాలో రకరకాల వార్తలు ప్రచారమవుతున్నాయి. రిలీజ్ కూడా వాయిదా పడొచ్చనే న్యూస్ వచ్చినా సరే హోంబాలే టీమ్ మాత్రం దాన్ని ఖండిస్తూ ఎలాంటి ప్రకటన చేయడం లేదు. థియేటర్ అగ్రిమెంట్లు, డిస్ట్రిబ్యూటర్ అడ్వాన్సులు జరుగుతున్నాయని అంటున్నారు కానీ ఏదో ఒక ప్రూఫ్ వస్తే కానీ ఫ్యాన్స్ నమ్మమంటున్నారు.
This post was last modified on November 9, 2023 5:23 pm
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…