Movie News

చైతూ-చందూ.. అన్నీ పెద్ద రేంజే

అక్కినేని నాగచైతన్య తన కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమాకు సిద్ధమవుతున్నాడు. గీతా ఆర్ట్స్ నిర్మాణంలో చైతూ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కనున్న సినిమా అతి త్వరలో సెట్స్ మీదికి వెళ్లబోతోంది. కార్తికేయ, కార్తికేయ-2 చిత్రాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన చందూ మొండేటి ఈ చిత్రానికి దర్శకుడు. ‘లవ్ స్టోరీ’లో చైతూతో జత కట్టిన సాయిపల్లవిని కథానాయికగా ఖరారు చేయడం తెలిసిందే.

ఈ సినిమా బడ్జెట్ దాదాపు వంద కోట్లని అంటున్నారు. చైతూ స్థాయికి ఇది చాలా పెద్ద బడ్జెట్టే. ఒక గుజరాతీ కథను ఆధారం చేసుకుని భారీ స్థాయిలో ఈ ప్రాజెక్టును సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి అన్నీ భారీగా ఉండేలా చూసుకుంటున్నారు. చైతూ కెరీర్లో ఇప్పటిదాకా ఏ సినిమాకూ జరగనంత కసరత్తు ఈ సినిమాకు జరుగుతోంది. స్క్రిప్ట్ రీడింగ్ సెషన్స్.. వర్క్ షాప్స్.. ప్రి ప్రొడక్షన్ అన్నీ కూడా చాన్నాళ్లుగా నడుస్తున్నాయి.

తన పాత్ర కోసం చైతూ బాడీ పెంచడమే కాక.. స్టైలింగ్ కూడా ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటున్నాడు. ఈ సినిమాకు పేరుమోసిన టెక్నీషియన్లు పని చేయబోతున్నారు. రకరకాల ఆప్షన్లు పరిశీలించాక చివరికి దేవిశ్రీ ప్రసాద్‌ను సంగీత దర్శకుడిగా ఖరారు చేసినట్లు సమాచారం. ఇంతకుముందు చైతూకు ‘దడ’, ‘రారండోయ్ వేడుక చూద్దాం’ లాంటి మ్యూజికల్ హిట్స్ ఇచ్చాడు దేవి. చాలా గ్యాప్ తర్వాత చైతూ సినిమాకు అతను పని చేయబోతున్నాడు. ఇక సినిమాటోగ్రఫీ బాధ్యతలను మధీకి అప్పగించబో

తున్నట్లు సమాచారం. ఆయన అందుబాటులో ఉంటే ఓకే, లేదంటే మరో పేరున్న సినిమాటోగ్రార్‌నే తీసుకోబోతున్నారట. ప్రొడక్షన్ డిజైన్ సహా సాంకేతిక విభాగాలన్నింటినీ పేరున్న వారినే తీసుకుని ప్రపంచ స్థాయి సినిమాగా దీన్ని తీర్చిదిద్దడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సినిమా క్లిక్ అయితే చైతూ రేంజే మారిపోతుందని చిత్ర వర్గాలు అంటున్నాయి.

This post was last modified on November 6, 2023 1:29 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మ‌ళ్లీ పాత‌కాల‌పు బాబు.. స‌ర్ ప్రైజ్ విజిట్స్‌కు రెడీ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌ళ్లీ పాత‌కాల‌పు పాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేయ‌నున్నారా? ప్ర‌భుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల ప‌నుల ను ఆయ‌న…

3 hours ago

షోలే, డిడిఎల్ కాదు….ఇకపై పుష్ప 2 సింహాసనం!

సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…

4 hours ago

అభిమాని గుండెల‌పై చంద్ర‌బాబు సంత‌కం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు 45 ఏళ్లుగా రాజ‌కీయాల్లో ఉన్నారు. ఇప్ప‌టికి మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…

4 hours ago

సినిమా నచ్చకపోతే డబ్బులు వాపస్…అయ్యే పనేనా?

థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…

5 hours ago

పుష్ప 2 : అప్పటి దాకా OTT లోకి వచ్చేదే లే!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…

6 hours ago