తెలుగు ప్రేక్షకులు తమిళ సినిమాలను ఎలా నెత్తిన పెట్టుకుంటారో తెలిసిందే. దసరాకు తెలుగులో భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు లాంటి భారీ చిత్రాలు రిలీజ్ కాగా.. వాటితో పోలిస్తే తమిళ అనువాద చిత్రమైన ‘లియో’కే ఎక్కువ క్రేజ్ కనిపించింది తొలి రోజు. ఆ చిత్రం బ్యాడ్ టాక్‌తో మొదలైనా సరే.. బ్రేక్ ఈవెన్ అయింది తెలుగులో. ‘లియో’కు తెలుగులో భారీగా థియేటర్లు కేటాయించి మంచి ఓపెనింగ్స్ వచ్చేలా చూశారు. కానీ అదే సమయంలో ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రాన్ని తమిళంలో రిలీజ్ చేద్దామని చూస్తే ఆ రాష్ట్రంలో థియేటర్లు ఇవ్వలేదు.
దీంతో రిలీజ్ వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. తమిళ అనువాదాల విషయంలో మన ప్రేక్షకులు, ఇండస్ట్రీ జనాలు ఉన్నంత స్పోర్టివ్‌గా.. మన సినిమాల విషయంలో తమిళ ప్రేక్షకులు, అక్కడి ఇండస్ట్రీ ఉండదనే చర్చ ఎప్పట్నుంచో ఉంది. ఇందుకు దసరా సినిమాలు తాజా రుజువు. ఈ నేపథ్యంలో ‘తంగలాన్’ సినిమా తెలుగు టీజర్ లాంచ్ కోసం వచ్చిన విక్రమ్ అండ్ కోకు మీడియా నుంచి ఈ చిన్నచూపు విషయమై ప్రశ్న ఎదురైంది. కానీ విక్రమ్, నిర్మాత జ్ఞానవేల్ రాజా ఒక మొక్కుబడి జవాబు ఇచ్చారు.
బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలు తమిళంలో బాగా ఆడాయని.. గతంలో కూడా చాలా సినిమాలు తమిళంలో మంచి ప్రభావం చూపాయని అన్నారు. ‘బాహుబలి’ కొన్నేళ్ల పాటు తమిళంలో హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచిందని కూడా చెప్పారు. ఐతే ‘బాహుబలి’ లాంటి భారీ చిత్రాలకు ఉన్న క్రేజ్ దృష్ట్యా అనివార్యంగా తమిళ ప్రేక్షకులు చూస్తారు. అంతే కాక అక్కడ థియేటర్లు కూడా ఇస్తారు. కానీ వేరే సినిమాలకు మాత్రం తమిళంలో ఇబ్బందులు తప్పట్లేదు.
అక్కడ థియేటర్లు ఇవ్వరు. జనం కూడా వాటిని ప్రోత్సహించరు. వాళ్లకు లోకల్ ఫీలింగ్ ఎక్కువ. ఐతే అక్కడి ప్రేక్షకులను మా సినిమాలు చూడండి అని డిమాండ్ చేయలేం, అలాగే తమిళ అనువాద సినిమాలు చూడొద్దని మన ప్రేక్షకులను ఆపలేం. కానీ మన సినిమాలు రిలీజవుతుంటే అక్కడ ఓ మోస్తరుగా అయినా థియేటర్లు ఇవ్వాలి.. ఇండస్ట్రీ నుంచి మన సినిమాలకు సహకారం అందాలి.. అదే సమయంలో తమిళ అనువాద చిత్రాలక ‘తంగలాన్’, ‘అయలాన్’ లాగా కాకుండా కనీసం తెలుగు టైటిళ్లు పెట్టాల అన్నవి న్యాయమైన డిమాండ్లే.
This post was last modified on November 2, 2023 6:29 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…