అదేంటి కాసేపు సేద తీరడానికి ఏదైనా కొనడానికి విశ్రాంతినివ్వడం ప్రతి సినిమాకు జరిగేదే కదా. ఇందులో కోపం తెచ్చుకోవడానికి ఏముందని అనుకుంటున్నారా. మ్యాటర్ చూస్తే మీకే అర్థమవుతుంది. మొన్న శుక్రవారం హాలీవుడ్ మూవీ కిల్లర్స్ అఫ్ ది ఫ్లవర్ మూన్ భారీ అంచనాల మధ్య రిలీజయ్యింది. మార్నింగ్ షో నుంచే చాలా పాజిటివ్ టాక్ తో సినీ ప్రియులను ఆకట్టుకోవడం మొదలుపెట్టింది. దీని నిడివి అక్షరాలా 3 గంటల 35 నిముషాలు. మాములుగా మనం రెండున్నర గంటలకే చాల్లేరా బాబు అనుకుంటాం. అలాంటిది ఇంతేసి నిడివి అంటే ఖచ్చితంగా బ్రేక్ కావాల్సిందే.
కానీ ఫ్లవర్ మూన్ దర్శక నిర్మాతలు మాత్రం ఇంటర్వెల్ ఇవ్వడం పెద్ద తప్పిదమని వాదిస్తున్నారు. తమ అనుమతి లేకుండా అలా చేస్తే చట్టపరమైన చర్యలకు సిద్ధం కావాల్సి ఉంటుందనే రీతిలో అమెరికా థియేటర్ యాజమానులకు వార్నింగ్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. టైటానిక్ హీరో లియోనార్డో డికాప్రియో ఇందులో ప్రధాన పాత్ర పోషించాడు. 1920 ఓక్లామా ప్రాంతంలో జరిగిన వరస హత్యల బ్యాక్ డ్రాప్ లో ఈ కథ జరుగుతుంది. గిరిజన జాతికి చెందిన భూమిలో ఆయిల్ ఆనవాళ్లు కనిపించాక జరిగే పరిణామాలే మెయిన్ ప్లాట్. దర్శకుడు మార్టిన్ సార్సెస్ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో రూపొందించారు.
సరే దీని సంగతి పక్కన పెడితే ఇంత సుదీర్ఘమైన నిడివితో మన దేశంలోనూ చాలా సినిమాలు వచ్చాయి. దాన వీర శూర కర్ణ, మేరా నామ్ జోకర్, లగాన్, సంగం, ఎల్ఓసి కార్గిల్, మొహబ్బతే, హం ఆప్కె హై కౌన్, జోధా అక్బర్ లాంటివి కొన్ని ఉదాహరణలు మాత్రమే. వీటికి షో మొదలయ్యాక రెండేసి ఇంటర్వెల్స్ ఇచ్చేవాళ్ళు. దానికి సిద్ధపడే ఆడియన్స్ రావాలని పేపర్ ప్రకటనలో ఆ విషయాన్ని స్పష్టంగా పేర్కొనేవారు. కానీ కిల్లర్స్ అఫ్ ది ఫ్లవర్ మూన్ మేకర్స్ మాత్రం ఒక్కసారి తలుపులు వేశాక ప్రొజెక్టర్ ఆపకూడదంటున్నారు. ఒకవేళ ఏదైనా అవసరం ఉన్నా ఆ మేరకు త్యాగం చేసి బయటికి వెళ్లి రావాల్సిందే.