టోర్నీ ప్రారంభమైన మొదట్లో ఓ మోస్తరు బజ్ ఉండేది కానీ ఇండియా నాన్ స్టాప్ గా మ్యాచులు గెలవడంతో ఒక్కసారిగా ప్రపంచ కప్ ఫీవర్ జనాల్లో విపరీతంగా పెరిగిపోయింది. పాకిస్థాన్ మీద గెలుపు దీన్ని ఇంకో స్థాయికి తీసుకెళ్లింది. ఇంకో నాలుగు మ్యాచులు బ్యాలన్స్ ఉన్నాయి. టైగర్ 3 చూస్తేనేమో నవంబర్ 12 విడుదల కాబోతోంది. సరిగ్గా అదే రోజు మన టీమ్ నెదర్ ల్యాండ్స్ తో తలపడుతుంది. పెద్దగా ప్రాధాన్యం లేని పోటీ అయినా ఎవరినీ తక్కువంచనా వేయలేని పరిస్థితిలో సెమి ఫైనల్ కి ప్రిపరేషన్ గా దీన్ని అభిమానులు ఎగబడి చూస్తారు. సహజంగానే ఓపెనింగ్ మీద ప్రభావం ఉంటుంది.
మూడు రోజులు గడవటం ఆలస్యం 15న ఒకటి, 16న మరో సెమి ఫైనల్ ఉంటాయి. వీటిలో ఒక దాంట్లో ఖచ్చితంగా ఇండియా ఉంటుంది కాబట్టి ఆ రోజు సగటు క్రికెట్ లవర్స్ ఎవరూ బయటికి రారు. టీవీలకు అతుక్కుపోతారు. ఇక 19న అసలైన గ్రాండ్ ఫైనల్ ఉంటుంది. ఒకవేళ భారతదేశం కనక దానికి చేరుకుంటే అహ్మదాబాద్ లో జరిగే తుది సమరానికి రోడ్డు మీద కర్ఫ్యూ వాతావరణం ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. రోహిత్ శర్మ దూకుడు చూస్తుంటే ఖచ్చితంగా కప్పు గెలుస్తామనే ధీమా ఫ్యాన్స్ లో కనిపిస్తోంది. సో కనీసం మూడు రోజుల టైగర్ 3 వసూళ్ల మీద దెబ్బ పడనుంది.
యష్ రాజ్ సంస్థ ఇవన్నీ చూసుకోలేదని కాదు కానీ దీపావళి పండగని వదిలితే అంత కన్నా మంచి డేట్ దొరకదు. డిసెంబర్ ని సలార్, డుంకీలు ఆక్రమించుకున్నాయి. జనవరి సంక్రాంతిలో ఖాళీలు లేవు. రిపబ్లిక్ డేకి హృతిక్ రోషన్ ఫైటర్ ఉంటుంది. సో వేరే ఆప్షన్ లేదు. పటాసుల పండగే బెస్ట్ ఆప్షన్. అలా అని టైగర్ 3కి ఒకటే ముప్పు కాదు. అదే టైంలో వైష్ణవ్ తేజ్ ఆదికేశవ, వర్మ వ్యూహంతో పాటు ఫైనల్ కు ముందు అజయ్ భూపతి మంగళవారంలు ఉన్నాయి. కాకపోతే సల్మాన్ కున్నంత రిస్క్ వీటికి లేదు. పఠాన్,జవాన్ రికార్డులను బద్దలు కొట్టే రేంజ్ ఒక్క టైగర్ 3కే ఉందని నార్త్ బయ్యర్లు నమ్మకంతో ఉన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates