దురంధర్ ది రివెంజ్ రూట్ క్లియరైపోయింది. సెన్సార్ ఆలస్యమంటూ ఉదయం నుంచి తిరుగుతున్న వార్తలకు చెక్ పడింది. 1 నిమిషం 34 సెకండ్ల ఫుటేజ్ పూర్తిగా తొలగించిన అధికారులు 25 సెకండ్లకు రీ ప్లేస్ మెంట్ చేయించారు. దీంతో ఫైనల్ నిడివి 3 గంటల 49 నిమిషాల 6 సెకండ్లు లాకయ్యింది. ఇందులోనే డిస్క్లైమర్లు, హెచ్చరికలు, థాంక్స్ గివింగ్ కార్డులు అన్నీ ఉంటాయి. ఇంటర్వెల్ తో కలిపి సంపూర్ణంగా నాలుగు గంటలు ఖర్చు పెట్టాల్సిందే.
సెన్సార్ ఇచ్చిన కట్స్, ఛేంజెస్ చూస్తుంటేనే వామ్మో అనిపిస్తోంది. ఇక అసలు సినిమాలో ఇంకెంత వయొలెన్స్ ఉంటుందో ఊహించుకోవడం కష్టం. ఇన్ సైడ్ టాక్ ప్రకారం రణ్వీర్ సింగ్ పాత్ర పంజాబ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఒళ్ళు జలదరించేలా ఉంటుందని, ఎవరూ ఊహించని షాకింగ్ కంటెంట్ దర్శకుడు ఆదిత్య ధార్ అందులో చూపించాడని అంటున్నారు. హీరో పీక్స్ పెర్ఫార్మన్స్ అందులోనే చూడొచ్చట. గంటకు పైగానే ఈ ట్రాక్ ఉంటుందని వినికిడి.
సోషల్ మీడియాలో ఇదంతా చూస్తూ ఆడియన్స్ అంతకంత అంచనాలు పెంచేసుకుంటున్నారు. టికెట్లు కూడా దానికి తగ్గట్టే అమ్ముడుపోతున్నాయి. ముంబైలో రౌండ్ ది క్లోక్ షోలు వేసేందుకు మల్టీప్లెక్సులు రెడీ అయ్యాయి. అర్ధరాత్రి అపరాత్రి అనే తేడా లేకుండా నిమిషం గ్యాప్ రాకుండా రోజు మొత్తం వీకెండ్ వరకు షెడ్యూల్స్ వేస్తున్నారు. హిట్ టాక్ వస్తే మాత్రం దేనికీ టికెట్లు దొరకని పరిస్థితి తలెత్తడం ఖాయం. మూవీ లవర్స్ ఆ నమ్మకంతోనే ఉన్నారు.
రేపు రాత్రి ఇన్స్ టా, ఎక్స్, ఫేస్ బుక్ తదితర సామాజిక మాధ్యమాలు దురంధర్ రివెంజ్ టాక్ తో హోరెత్తిపోవడం ఖాయం. అయిదు గంటలకు మొదలయ్యే ప్రీమియర్ తొమ్మిదికి పూర్తయిపోతుంది కాబట్టి అక్కడి నుంచే టాక్ మొదలవుతుంది. ఎల్లుండి ఉస్తాద్ భగత్ సింగ్ ఉన్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో హైప్ ఆటోమేటిక్ గా పవన్ కళ్యాణ్ వైపే ఉండటం సహజం. కాకపోతే ఫైనల్ గా ఎవరు బెస్ట్ టాక్ సంపాదించుకుంటారనేది వీకెండ్ డామినేషన్ ని నిర్ణయిస్తుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates