మన స్టార్ హీరోలకు మల్టీప్లెక్స్ బిజినెస్ బాగా కలిసి వస్తున్నట్టుంది. ఏఎంబి మాల్ తో మహేష్ బాబు ఈ రంగంలోనూ బ్లాక్ బస్టర్ కొట్టాక త్వరలో ఏకంగా రాష్ట్రం దాటేసి బెంగళూరులోనూ ఒకటి ప్రారంభించేందుకు రెడీ అవుతున్నాడు. దీనికీ ఏషియన్ ఫిలిమ్స్ భాగస్వామిగా వ్యవహరించబోతోంది. ఈ స్ఫూర్తితోనే విజయ్ దేవరకొండ మహబూబ్ నగర్ లో ఒక సముదాయం ఓపెన్ చేయగా సూపర్ హిట్ కొట్టేసింది. ఆ జిల్లా ప్రజలకు బెస్ట్ ఎక్స్ పీరియన్స్ ఇస్తోంది. చెన్నైలో శివ కార్తికేయన్ పార్ట్ నర్ షిప్ లో ఈ తరహాలోనే మల్టీప్లెక్స్ పనులను వేగవంతం చేసింది ఏషియన్ ఫిలిమ్స్.
వీళ్ళందరితో పాటు అల్లు అర్జున్ ఇటీవలే అమీర్ పేట్ సత్యం థియేటర్ స్థానంలో అయిదు స్క్రీన్ల సముదాయంతో ఈ బిజినెస్ లోకి అడుగు పెట్టాడు. మళ్ళీ ప్రత్యేకంగా ఏషియన్ భాగస్వామ్యమని చెప్పనక్కర్లేదు. ఇదిలా ఉండగా అల్లు ఫ్యామిలీ ఇంకో ప్లానింగ్ లో ఉందట. హైదరాబాద్ నగరంలోనే అత్యంత ఖరీదైన డిమాండ్ ఉన్న ప్రాంతంగా మారిపోయిన కోకాపేట్ లో ఒక మల్టీప్లెక్స్ నిర్మించేందుకు రంగం సిద్ధమవుతున్నట్టు వినికిడి. నర్సింగికి దగ్గరయ్యే రీతిలో ఒక మంచి చోటు చూసి ఆ మేరకు ప్రీ ప్లానింగ్ కూడా జరిగిపోయిందని సమాచారం. అధికారికంగా రాలేదు.
ఇది బన్నీ సోలోగా నడిపిస్తాడా లేక జాయింట్ గా వేరొకరు ఉంటారా అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి ఖరీదైన అనుభూతిని కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తూ ఆడియన్స్ కి కొత్త ఎక్స్ పీరియన్స్ లు అందజేస్తున్న మల్టీప్లెక్సులు భాగ్యనగరంలో ఇబ్బడిముబ్బడిగా పుట్టుకొస్తున్నా ఆదరణ బాగానే ఉంటోంది. ఎటాచ్సి కొత్త హిట్ సినిమాలు వచ్చినప్పుడు ఇబ్బంది లేదు కానీ ఎపుడైనా శుక్రవారాలు సరైన రిలీజులు లేక డ్రైగా మారిపోతే మాత్రం షోలు క్యాన్సిల్ చేసుకుంటూ ఖాళీ కౌంటర్లతో గడపాల్సి వస్తోంది. అయినా లాభసాటి బిజినెస్ కాకపోతే ఎవరైనా ఇందులోకి ఎందుకు వస్తారు చెప్పండి.
This post was last modified on October 23, 2023 9:47 am
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…