‘ఖైదీ’, ‘విక్రమ్’ సినిమాలతో లోకేష్ కనకరాజ్‌కు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. దేశంలో రాజమౌళి తర్వాత దర్శకుడిగా ఎక్కువ క్రేజ్ దక్కించుకున్నది లోకేషే అంటే అతిశయోక్తి కాదు. కేవలం అతడి పేరు చూసే ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లిపోయే పరిస్థితి వచ్చింది. తన కొత్త సినిమా ‘లియో’ దసరా సీజన్లో రెండు పెద్ద తెలుగు సినిమాలతో పోటీ పడుతూ వాటిని మంచి క్రేజ్ సంపాదించుకుందంటే అందుకు కారణం హీరో విజయ్ కాదు, దర్శకుడు లోకేష్ కనకరాజే.
ఈ మధ్య కాలంలో తెలుగు ప్రేక్షకులు ఇంత క్యూరియాసిటీ ఏ సినిమా విషయంలోనూ చూపించలేదు. కానీ ఎన్నో అంచనాలతో థియేటర్లకు వెళ్లిన ఆడియన్స్‌కు నిరాశ తప్పలేదు. లోకేష్ సినిమాటిక్ యూనివర్శ్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆడియన్స్.. ఈ విషయంలో బాగా నిరాశ పడ్డారు. ఏదో మొక్కుబడిగా ఎల్‌సీయూతో కనెక్షన్ కలిపాడే కానీ.. అందులో ఒరిజినాలిటీ కనిపించలేదు.
‘లియో’లో అసలు విషయం లేదా అంటే అదేమీ కాదు. ఒక ఎగ్జైటింగ్ యాక్షన్ ఎంటర్టైనర్ తీయడానికి తగ్గ సెటప్ కుదిరినా.. కథనంలో ఉత్కంఠ రేపే విషయాలు లేకపోవడం.. కేవలం పార్తిబన్ లియోనా కాదా అనే విషయం మీదే ఆరంభం నుంచి చివరి వరకు కథ నడవడం ప్రతికూలంగా మారింది. కథలో వేరే డైమన్షనే కనిపించకపోవడంతో ప్రేక్షకులకు విసుగు పుట్టింది. లోకేష్ ఏదో హడావుడిగా, మొక్కుబడిగా ఈ కథను లాగించేసినట్లు అనిపించిందే తప్ప ఇంటెన్సిటీ లేకపోయింది. ఏ పాత్ర కూడా ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. సంజయ్ దత్, అర్జున్ లాంటి నటులను పూర్తిగా వేస్ట్ చేసేశాడు లోకేష్.
అతను ఇంకొంచెం టైం తీసుకుని ఈ పాత్రలను.. సినిమాలోని కీలక ఘట్టాలను ఇంకొంచెం ఎఫెక్టివ్‌గా రాసుకుని, వాటికి తన మార్కు టేకింగ్ జోడించి ఉంటే సినిమా వేరే లెవెల్లో ఉండేది. ఇంత నెగెటివ్ టాక్‌లోనూ ‘లియో’ బాగానే ఆడుతుండటం లోకేష్ పట్ల ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్‌కు నిదర్శనం. సినిమా ఓ మోస్తరుగా ఉన్నా సినిమా రేంజే వేరుగా ఉండేది. ఇక ఖైదీ, విక్రమ్‌ల మాదిరి సినిమా పకడ్బందీగా ఉండి ఉంటే ఈ సినిమాకు ఆకాశమే హద్దు అయ్యేది. ‘విక్రమ్’ తీశాక ఏడాది వ్యవధిలోనే సినిమా తీసేసి రిలీజ్ చేసేయాలని టార్గెట్ పెట్టుకోవడం మైనస్ అయినట్లు కనిపిస్తోంది. ఈసారైన లోకేష్ హడావుడి పడకుండా.. రజినీ సినిమా మీద ఎక్కువ సమయం, శ్రద్ధ పెట్టి తీస్తే తన నుంచి మళ్లీ ఓ బ్లాక్‌బస్టర్ రావచ్చు.
This post was last modified on October 22, 2023 3:43 pm
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…