నేచురల్ స్టార్ నాని, వివేక్ ఆత్రేయ అనగానే.. ‘అంటే సుందరానికి’ తరహాలోనే ఒక క్లాస్ లవ్ స్టోరీ వస్తుందని అంచనా వేస్తారు ప్రేక్షకులు. వివేక్ మొదటి సినిమా ‘మెంటల్ మదిలో’ కూడా క్లాస్‌గా సాగిపోయే లవ్ స్టోరీనే. రెండో చిత్రం ‘దోచేవారెవరురా’ క్రైమ్ కామెడీ కథాంశంతో తెరకెక్కింది. ఇక ‘అంటే సుందరానికి’ సంగతి తెలిసిందే. కానీ ఈసారి వాళ్లిద్దరూ పూర్తిగా రూటు మార్చేస్తున్నారు.
వీరి కలయికలో రాబోయే కొత్త చిత్రం ఒక ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కనుందట. వీళ్ల కాంబినేషన్ నుంచి ఇలాంటి సినిమా వస్తుందని ఊహించని విధంగా ఈ చిత్రం ఉంటుందని టీం సమాచారం. ఈ సినిమా కోసం ఎంచుకున్న విలన్ ఎవరో చూస్తే.. వాళ్లు అంచనాలకు భిన్నంగా సాగిపోనున్నారని అర్థమవుతుంది. తమిళంలో ప్రస్తుతం తిరుగులేని క్రేజ్, డిమాండ్ తెచ్చుకున్న ఎస్.జె.సూర్య నాని-వివేక్ సినిమాలో విలన్ పాత్ర చేస్తుండటం విశేషం.
విజయ్, మహేష్ బాబు సహా చాలామంది పెద్ద హీరోల సినిమాల్లో విలన్ పాత్రలతో అదరగొట్టాడు సూర్య. ఇటీవలే విశాల్ సినిమా ‘మార్క్ ఆంటోనీ’లో విలనీతో పాటు కామెడీ కూడా అదరగొట్టేశాడు. ఆ సినిమా తమిళంలో వంద కోట్ల వసూళ్లు సాధించిందంటే అందులో సూర్య పాత్ర ఎంతో కీలకం. సూర్య డిమాండ్ ఏ స్థాయిలో ఉందంటే విలన్ పాత్ర చేయడానికి అతను రూ.10 కోట్ల దాకా డిమాండ్ చేస్తున్నాడట.
ఈ పారితోషకం సంగతి తెలిసి చాలామంది వామ్మో అనుకుంటున్నారు. కానీ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ మాత్రం పట్టుబట్టి అతను కోరిన పారితోషకం ఇచ్చి నాని-వివేక్ సినిమాలో విలన్ పాత్రకు ఒప్పించారు. ఈ రోజే ఈ సినిమా గురించి అనౌన్స్‌మెంట్ రాగా.. దీంతో పాటే ఎస్.జె.సూర్య ఇందులో నటించనున్న సమాచారం కూడా అధికారికంగా బయటికి వచ్చింది. ఇంకా హీరోయిన్ సంగతి తేలలేదు. నాని కెరీర్లో ‘దసరా’ తర్వాత అత్యధిక బడ్జెట్లో తెరకెక్కనున్న సినిమా ఇదే.
This post was last modified on October 22, 2023 3:53 pm
దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…
సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…
టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…