ప్యాన్ ఇండియా సినిమాలకు సంగీత దర్శకుడిని ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సెలక్షన్ ఏ మాత్రం తేడా కొట్టినా దాని ఎఫెక్ట్ నేరుగా థియేటర్ ఆడియన్స్ మీద పడుతుంది. కేవలం అనిరుద్ రవిచందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వల్లే జైలర్, విక్రమ్ లు వాటి కంటెంట్ స్థాయిని మించి బాక్సాఫీస్ అద్భుతాలు చేశాయన్నది వాస్తవం. తమన్, దేవిశ్రీ ప్రసాద్ లాంటి వాళ్ళు సైతం తమకు స్వేచ్ఛ, ఛాలెంజ్ ఇచ్చే కంటెంట్ దొరికినప్పుడు చెలరేగిపోవడం చాలా సార్లు చూశాం. అఖండ, వాల్తేరు వీరయ్య లాంటి ఉదాహరణలు చాలు. ఈ మధ్య తమిళ మ్యూజిక్ డైరెక్టర్లను తీసుకోవడం ఎక్కువయ్యింది.
జివి ప్రకాష్ కుమార్ మనకు కొత్త కాదు. ప్రభాస్ డార్లింగ్, రామ్ ఎందుకంటే ప్రేమంటకు మంచి ఆల్బమ్స్ ఇచ్చాడు. ఒంగోలు గిత్తకు నాలుగు పాటలు కంపోజ్ చేశాడు. డబ్బింగ్ చిత్రాల్లోనూ యుగానికి ఒక్కడు, షాపింగ్ మాల్ లాంటివి చాలా పేరు తీసుకొచ్చాయి. ఆ నమ్మకంతోనే టైగర్ నాగేశ్వరరావు లాంటి పెద్ద బాధ్యతను అతనికి ఇచ్చారు. ట్యూన్స్ రాబట్టుకోవడం దర్శకుడు వంశీ ఫెయిలయ్యాడో లేక మంచి బిజిఎం ఇవ్వడంతో ప్రకాష్ తడబడ్డాడో తెలియదు కానీ కానీ రవితేజ మూవీకి అతి పెద్ద మైనస్ లలో సంగీతం ఉండటం మాస్ రాజా అభిమానులను బాగా కలవరపరిచింది .
ఇంత టాలెంట్ ఉన్న ప్రకాష్ ఇలాంటి స్కోర్ ఇవ్వడం షాక్ ఇచ్చేదే. ఇతని రాబోయే సినిమాలు కూడా ఆషామాషీవి కాదు. ధనుష్ కెప్టెన్ మిల్లర్, వైష్ణవ్ తేజ్ ఆదికేశవ, విక్రమ్ తంగలాన్, కంగనా రౌనత్ ఎమెర్జెన్సీ, కార్తీ జపాన్, అక్షయ్ కుమార్ ఆకాశం నీ హద్దురా రీమేక్ ఇలా పెద్ద లిస్టు ఉంది. మరి పని ఒత్తిడిలో టైగర్ నాగేశ్వరరావు సరిగా అవుట్ ఫుట్ ఇవ్వలేకపోయాడా లేక ఇంకేదైనా కారణమా లోగుట్టు పెరుమాళ్ళకెరుక. అదే పనిగా కోలీవుడ్ నుంచి తీసుకొచ్చి మరీ ఆఫర్ ఇస్తే ఇలా చేయడం భావ్యం కాదు కానీ వీలైనంత బెస్ట్ రాబట్టుకోవడంలో మొదటి బాధ్యత ముమ్మాటికీ దర్శకుడిదే.
This post was last modified on October 21, 2023 11:59 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…