మొన్నటి నుంచి మనం భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు, లియో అంటూ దసరా సినిమాల హడవిడిలో పడిపోయాం కానీ సందట్లో సడేమియా అంటూ ఓ బాలీవుడ్ మూవీ వచ్చిన సంగతే జనాలు మర్చిపోయారు. అదే గణపథ్. మాస్ లో మంచి మార్కెట్ ఉన్న టైగర్ శ్రోఫ్ హీరోగా, ఆదిపురుష్ సీత కృతి సనన్ హీరోయిన్ గా రూపొందిన ఈ స్కై ఫై ఫాంటసీలో అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్ర పోషించారు. టీజర్ రిలీజైన టైంలో ప్రభాస్ కల్కి పోలికలు ఉన్నాయనే అనునామాలు కొందరు వ్యక్తం చేశారు. తీరా చూస్తే ఈ గణపథ్ థియేటర్ కు వచ్చిన జనాలను పూర్తిగా చూడనివ్వకుండానే పరుగులు పెట్టిస్తున్నాడు.
ఇదో విచిత్రమైన కథ. 2060 AD సంవత్సరంలో ప్రపంచం రెండుగా విడిపోయి ఉంటుంది. ఒకటి ధనవంతులు సృష్టించిన సిల్వర్ సిటీ. ఇక్కడ మనుషుల కన్నా రోబోలు, డ్రోన్లు ఎక్కువ ఉంటాయి. సాంకేతికత ఆధిపత్యం చెలాయిస్తూ ఉంటుంది. మరొకటి గరీబొంకి బస్తీ. అంటే కూడు గుడ్డకు ఠికానా లేని పేదవాళ్ల అడ్డా. తమను కాపాడేందుకు గణపథ్ వస్తాడని ఎదురు చూస్తూ ఉంటారు. ఆ కారణజన్ముడే హీరో గుడ్డు(టైగర్ శ్రోఫ్). ఇతడేమో డబ్బున్న వాళ్ళ వైపు ఉంటాడు. మరి బాబుకి జ్ఞానోదయం కలిగి అన్నార్తుల కోసం ఏం చేశాడు, గణపథ్ గా ఎలా మారాడు అనేదే స్టోరీ.
తీసికట్టు విజువల్ ఎఫెక్ట్స్ తో సహనానికి పెద్ద పరీక్ష పెడతాడు గణపథ్. టైగర్ శ్రోఫ్ హీరోయిజంని అతిగా ఎలివేట్ చేయించే ఉద్దేశంతో పెట్టిన ఫైట్లు, చీటికీ మాటికి చొక్కా విప్పించి సిక్స్ ప్రదర్శనలు ఇప్పించడాలు హద్దులు దాటిపోయాయి. అమితాబ్ క్యారెక్టర్ కామెడీకి సీరియస్ కి మధ్య అప్పడమైపోయింది. మ్యాడ్ మ్యాక్స్, డ్యూన్, డిస్ట్రిక్ట్ 9, ఎలిసియం లాంటి హాలీవుడ్ మూవీస్ ని నిర్మొహమాటంగా కాపీ కొట్టిన దర్శకుడు వికాస్ బహ్ల్ కనీస స్థాయిలో గణపథ్ ని తీర్చిదిద్దలేదు. ఫలితం క్లైమాక్స్ చివరి దాకా కూర్చున్న వాళ్ళను సన్మానించాలనే రేంజ్ లో ఈ కళాఖండం ఉందని విమర్శకులు తలంటుతున్నారు.
This post was last modified on October 21, 2023 11:20 am
హాలీవుడ్ మూవీ ముఫాసా ది లయన్ కింగ్ కి మహేష్ బాబు డబ్బింగ్ చెప్పాలని నిర్ణయించుకున్నప్పుడు ఎందుకు అవసరమా అని…
సినిమాల మేకింగ్ ముచ్చట్లను రిలీజ్ తర్వాత ఆన్ లైన్లో రిలీజ్ చేయడం మామూలే. చాలా వరకు యూట్యూబ్లోనే అలాంటి వీడియోలు…
నిన్న రాత్రి హఠాత్తుగా దేశవ్యాప్తంగా ఉన్న పివిఆర్ ఐనాక్స్ మల్టీప్లెక్సుల్లో పుష్ప 2 ది రూల్ బుకింగ్స్ తీసేయడం సంచలనమయ్యింది.…
టాలీవుడ్ లో సంగీత దర్శకుల కొరత గురించి చెప్పనక్కర్లేదు. తమన్, దేవిశ్రీ ప్రసాద్ ని అందరూ తీసుకోలేరు. పైగా వాళ్ళు…
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన ఆటతో మాత్రమే కాకుండా వ్యక్తిగత జీవితంతో కూడా నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు.…