పెద్ద స్టార్ హీరోలకు పని చేస్తున్నప్పుడు తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మీద ప్రత్యేక అంచనాలు నెలకొంటున్నాయి. ముఖ్యంగా అఖండ తర్వాత ఇది పీక్స్ కు వెళ్లిపోయింది. ప్రతి ఆల్బమ్ అల వైకుంఠపురములో రేంజ్ లో కాకపోయినా ఉన్నంతలో మంచి సాంగ్స్ ఇవ్వడానికి బాగా కష్టపడుతున్నాడు. భగవంత్ కేసరి పాటలు ఆడియో పరంగా మంచి రెస్పాన్స్ దక్కించుకున్నప్పటికీ ఫ్యాన్స్ కి కావాల్సిన అసలైన కిక్ ఏదో మిస్ అయ్యిందన్న వెలితి వెంటాడుతూ వచ్చింది. ఎందుకంటే రిలీజ్ చేసిన రెండు లిరికల్ వీడియోలు శ్రీలీలతో ముడిపడి ఉన్నవి కావడంతో మాస్ వీ వాంట్ మోర్ అని డిమాండ్ చేశారు.
ఆ లోటుని రోర్ అఫ్ భగవంత్ కేసరి పాటతో సరిచేశాడు తమన్. దీనికోసమే ప్రత్యేకంగా రెండు రోజుల పాటు నాన్ స్టాప్ గా రికార్డింగ్ స్టూడియోలో పని చేసిన ఈ మ్యూజిక్ సెన్సేషన్ మొత్తానికి హైప్ ని నిలబెట్టుకునేలా అదిరిపోయే బీట్స్ ఇచ్చి పడేశాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కాసర్ల శ్యామ్ సాహిత్యంలో కేసరి వ్యక్తిత్వాన్ని వర్ణించిన తీరు కొత్తగా ఉంది. మాములుగా తెలంగాణ స్లాంగ్ తో రాసే శ్యామ్ కి ఇలా హీరోయిజం ఎలివేట్ చేసే అవకాశం రావడం అరుదు. దానికి తగ్గట్టే నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. అయితే ఇదేదో ఓ వారం ముందు చేసి ఉంటే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అసలైన దంచవే మేనత్త కూతురా ఇంకా బాలన్స్ ఉంది. దసరా పండగ రోజు జోడిస్తారు కాబట్టి అప్పటిదాకా వెయిట్ చేయాలి. మంగమ్మ గారి మనవడులోని ఈ పాట రీమిక్స్ చేయడం కొత్త కాదు. గతంలో నాని రైడ్ లో వాడుకున్నారు. అప్పుడు సంగీతం సమకూర్చింది హేమ చంద్ర. కానీ తమన్ రేంజ్, ఇన్స్ ట్రుమెంటేషన్ వేరు కాబట్టి నెక్స్ట్ లెవెల్ లో ఆశించవచ్చు. ఇంతే కాదు బిజిఎంతో పాటు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో బాలయ్య సర్ప్రైజ్ గెటప్ కోసం మరో సిగ్నేచర్ ట్యూన్ ఇచ్చాడని ఇన్ సైడ్ టాక్. ఇన్నేసి స్పెషల్స్ దాచారు అంటే మ్యాటర్ గట్టిగానే ఉంది. ఇంకో ఇరవై నాలుగు గంటల్లో ఫలితం తేలబోతోంది.
This post was last modified on October 18, 2023 11:33 am
ప్రపంచవ్యాప్తంగా విజయ్ అభిమానులను తీవ్ర మనస్థాపానికి గురి చేసిన జన నాయకుడు సెన్సార్ వివాదం ఒక కొలిక్కి వచ్చేసింది. యు/ఏ…
వెండితెరకు చాలా గ్యాప్ తీసుకున్న సమంత త్వరలో మా ఇంటి బంగారంతో కంబ్యాక్ అవుతోంది. జీవిత భాగస్వామి రాజ్ నిడిమోరు…
ప్రభాస్ అభిమానుల ఎదురు చూపులకు బ్రేక్ వేస్తూ రాజా సాబ్ థియేటర్లలో అడుగు పెట్టేశాడు. టాక్స్, రివ్యూస్ సంగతి కాసేపు…
ఏ రాష్ట్రంలో అయినా... ప్రతిపక్ష నాయకులకు ప్రభుత్వాలు పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వవు. సహజంగా రాజకీయ వైరాన్ని కొనసాగిస్తాయి. ఏపీ సహా…
ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపాయి. పార్టీలకు…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గానికి సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చింది. శుక్రవారం నుంచి…