వచ్చే 2024లో ఏపీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి విజయం దక్కించుకుని తీరాలనే కసితో ఉన్న వైసీపీ అధినేత జగన్.. తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కులాల వారీగా ఉన్న జనాభా ఎంత? వారి ఓటు బ్యాంకు ఎవరికి అనుకూలంగా ఉందనే విషయాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. దీనిలో భాగంగా ఒక సర్వేను అధికారికంగా, మరో సర్వేను అనధికారికంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
ఏపీలో కులాల వారీగా జనాభా ఎంత ఉన్నారనే అంశంపై వైసీపీ ప్రభుత్వం పక్కా లెక్కలు తీయనుంది. దీనికి సంబంధించి తాజాగా సీఎం జగన్ ఉన్నతాధికారులతో మంతనాలు సాగించారు. లెక్కలు ఎలా వేయాలి? కులాల ను ఏ విధంగా గుర్తించాలి(కొన్నింటిని) అనే అంశంపై చర్చించినట్టు తెలిసింది. అత్యంత రహస్యంగా చేసిన ఈ మంతనాలపై వైసీపీ వర్గాల్లో గుసగుస ప్రారంభమైంది. రాష్ట్రంలో కుల గణన చేపట్టేందుకు సర్కారు నిర్ణయించినట్టు వీరు చెబుతున్నారు.
దీనిలో భాగంగా కులాల గణను అధికారికంగా చేపట్టనున్నారు. అదేసమయంలో అనధికారికంగా ఆయా కులాల ప్రజలు ఎవరికి అనుకూలంగా ఉన్నారనే విషయాలను కూడా వైసీపీ ప్రభుత్వం సర్వే ద్వారా కూపీ లాగనుంది. నవంబరు 15 నుంచి ఈ కుల గణన ప్రక్రియ ప్రారంభం కానున్నట్టు సమాచారం. కుల గణనలోనే రెండు మూడు ప్రశ్నల ద్వారా ఆయా కులాల కు చెందిన వారు ఏ పార్టీకి, ఏ నాయకుడికి అనుకూలమో.. ఎమ్మెల్యేపై వారి అభిప్రాయం ఏంటో కూడా తెలుసుకోనున్నారని తెలిసింది.
ఇదే జరిగితే.. 2024 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వైసీపీ వ్యూహాత్మకంగా వేస్తున్న అడుగులు మరింత పుంజుకోనున్నాయి. ఇప్పటికే బిహార్ రాష్ట్రంలో కుల గణన చేపట్టారు. దీనిని కేంద్ర ప్రభుత్వం దఫదఫాలుగా వ్యతిరేకించింది.కానీ, సుప్రీంకోర్టు సమర్థించింది. దీంతో ఇప్పుడు బిహార్ తర్వాత ఏపీలో కులగణన ప్రక్రియ ద్వారా.. ఉభయ కుశలోపరి అన్నట్టుగా ఎన్నికల్లో ప్రజల నాడిని కూడా పసికట్టేందుకు వైసీపీ ప్రభుత్వం రెడీ అయినట్టు తెలుస్తోంది.
This post was last modified on October 18, 2023 11:20 am
టాలెంట్, రూపం రెండూ ఉన్న నటుడు ఆది పినిశెట్టి. మొదట హీరోగా పరిచయమైనా సరైనోడులో విలన్ గా మెప్పించాక ఒక్కసారిగా…
ఇప్పుడు పాడటం లేదు కానీ ఇరవై సంవత్సరాల క్రితం తెలుగు సంగీతంలో పాప్ మ్యూజిక్ అనే ఒరవడి తేవడంలో గాయని…
ఏపీలో మెడికల్ కాలేజీల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కొనసాగుతోంది. దీనికి డెడ్లైన్ను మళ్లీ…
సంగీత దర్శకుడు తమన్ అఖండ 2 కోసం ఇచ్చిన సంగీతం మీద మిశ్రమ స్పందనే దక్కింది. ఆడియో శివ భక్తులకు…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక సమస్యగా ఉన్న రైతుల అంశాన్ని ప్రభుత్వం దాదాపు పరిష్కరించింది. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని…
రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల…