కొబ్బరి మట్ట, హృదయ కాలేయం లాంటి స్పూఫ్ కామెడీ సినిమాలతో మంచి హిట్లు కొట్టిన సంపూర్ణేష్ బాబు కెరీర్ అనుకున్నంత వేగంగా సాగలేదు. పదే పదే ఆ టైపు కథలే చేయడం జనానికి బోర్ కొట్టేసి తర్వాత పట్టించుకోవడమే మానేశారు. పోనీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుదామంటే సరైన అవకాశాలు రాలేదు. దీంతో అడపాదడపా దర్శనం తప్ప పెద్దగా కనిపించకుండా పోయిన సంపూ వచ్చే వారం అక్టోబర్ 27 మార్టిన్ లూథర్ కింగ్ తో థియేటర్లలో అడుగు పెడుతున్నాడు. ఇరవై రోజుల ముందే తెలుగు రాష్ట్రాల్లో పలు నగరాల్లో సాధారణ ప్రేక్షకులకు ప్రీమియర్లు వేశారు.
ఇంత ఖర్చు పెట్టి కష్టపడి తిరుగుతున్నా ఈ మార్టిన్ లూథర్ కింగ్ మీద పబ్లిక్ దృష్టి అంతగా పోవడం లేదు. అందరూ దసరా చిత్రాల మత్తులో ఉన్నారు. వేటికవే భారీ సినిమాలు కావడంతో అన్నీ చూసేయాలన్న మూవీ లవర్స్ ఎక్కువగా ఉన్నారు. భగవంత్ కేసరి, లియో, టైగర్ నాగేశ్వరరావు మూడు కవర్ చేసి పండగ సంబరాలు పూర్తి చేసుకునే లోపు నెలాఖరు వచ్చేసి పర్సులు ఖాళీ అయిపోతాయి. అలాంటి టైంలో సంపూర్ణేష్ కోసం మళ్ళీ టికెట్లు కొని థియేటర్లకు రావడం అంత సులభంగా ఉండదు. సెప్టెంబర్ చివర్లో పెదకాపు 1, చంద్రముఖి 2 లాంటి క్యాస్టింగ్ ఉన్న వాటినే ఎవరూ పట్టించుకోలేదు.
అలాంటప్పుడు సంపూర్ణేష్ కి ఓపెనింగ్స్ రావడం పెద్ద సవాలే. అసలే ఇది తమిళ మండేలాకు రీమేక్. ఒరిజినల్ వెర్షన్ చాలా బాగా పేరు తెచ్చుకుంది. పెద్దగా మార్పులు చేయకుండా యథాతథంగా తీశారు కానీ ఓటిటిలో దాన్ని చూడని వాళ్ళు మాత్రమే మార్టిన్ లూథర్ కింగ్ వైపు కన్నేస్తారు. నవంబర్ మొదటి వారం వచ్చి ఉంటే కాస్తే బెటర్ గా ఉండేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆ తర్వాత దీపావళి నుంచి టైగర్ 3 తో మొదలుపెట్టి నాన్ స్టాప్ గా భారీ సినిమాలు క్యూ కడతాయి. సో మార్టిన్ లూథర్ కింగ్ కి బలగం రేంజ్ లో మాస్ వర్గాలకు కనెక్ట్ అయ్యేలా టాక్ వస్తే నిలదొక్కుకుంటుంది.
This post was last modified on October 17, 2023 9:23 pm
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్ పై భారత్ ఘన విజయం సాధించింది.…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్ధం అయిపోయింది. జనసేన అసెంబ్లీలో తనదైన శైలి 100 శాతం బలంతో అడుగుపెట్టిన…
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని రేవంత్రెడ్డి పాలన ప్రారంభించి ఏడాది దాటిపోయింది. ఈ నేపథ్యంలో ఒకదఫా పార్లమెంటు ఎన్నికలు వచ్చాయి.…
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా సెలవు రోజు అయిన ఆదివారం దుబాయి అంతర్జాతీయ స్టేడియంలో దాయాదీ దేశాలు భారత్, పాకిస్థాన్ ల…
తెలుగు రాష్ట్రాల్లో సంగీత దర్శకులు నిర్వహించే మ్యూజిక్ కన్సర్టులు తక్కువ. ఇళయరాజా రెండుసార్లు హైదరాబాద్ లో చేస్తే భారీ స్థాయిలో…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ ఆదివారం సరదా సరదాగా గడిపారు. ఓ వైపు పార్టీ…