థియేటరుకు వెళ్లి సినిమా చూడటం ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందికి చాలా ఇష్టమైన వ్యాపకం. ఆ వ్యాపకానికి కరోనా గండి కొట్టేసింది. వారం వారం కొత్త సినిమా విడుదల కాగానే థియేటర్లకు పరుగులు పెట్టే ప్రేక్షకుల పరిస్థితి ఈ ఆరు నెలల్లో ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయా.. కొత్త, పాత అని తేడా లేకుండా వెళ్లి ఏదో ఒక సినిమాను బిగ్ స్క్ర్రీన్ మీద చూద్దామా అని ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు లెక్కే లేదు. ఇండియాలో వచ్చే నెలలోనే థియేటర్లు తెరుచుకుంటాయని అంటున్నారు. వేరే దేశాల్లో అయితే ఆల్రెడీ థియేటర్లు పున:ప్రారంభం అయ్యాయి.
కరోనా షరతుల మధ్య విజయవంతంగా సినిమాలు నడిపించేస్తున్నారు. అసలే చాలా విరామం తర్వాత థియేటర్లు తెరుచుకున్నాయి. పైగా క్రిస్టఫర్ నోలన్ తీసిన మెగా మూవీ ‘టెనెట్’ విడుదలైంది. ఇక ప్రపంచ సినీ ప్రియుల ఉత్సాహం ఎలా ఉంటుందో చెప్పేదేముంది?
సామాన్య ప్రేక్షకులే కాదు.. టామ్ క్రూయిజ్ లాంటి అగ్ర కథానాయకుడు కూడా ఈ విషయంలో తన ఎగ్జైట్మెంట్‌ను ఆపుకోలేకపోయాడు. ఈ సినిమా ఆడుతున్న ఓ మెగా థియేటర్‌కు వెళ్లాడు. అక్కడ ప్రేక్షకుల హంగామా మధ్య సినిమా చూశాడు. సంబంధిత వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అదిప్పుడు వైరల్ అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులను ఆ వీడియో ఉద్వేగానికి గురి చేస్తోంది.
సినిమా అంటే వీళ్లందరిలో ఉన్న ప్రేమను ఉద్వేగభరితంగా చాటుకుంటున్నారు. ఈ ఏడాది వేసవిలోనే రావాల్సిన ‘టెనెట్’ కరోనా వల్ల పలుమార్లు వాయిదా పడింది. ఎట్టకేలకు ఇటీవలే పరిస్థితులు మెరుగుపడ్డ కొన్ని దేశాల్లో విడుదలైంది. సినిమా అంచనాలకు ఏమాత్రం తగ్గని విధంగా ఉందని, నోలన్ నుంచి వచ్చిన మరో క్లాసిక్ ఇదని అంటున్నారు. కరోనా పరిస్థితుల్ని సమీక్షిస్తూ.. ఒక్కో దేశంలో ఈ సినిమా విడుదల చేసుకుంటూ వెళ్లనున్నారు.ఇండియాలో కూడా దసరా సమయానికి ‘టెనెట్’ విడుదల కావచ్చని ఆశిస్తున్నారు.
This post was last modified on August 30, 2020 9:44 am
గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…
కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…
భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…
అమెరికా వీసా వచ్చేసింది కదా.. ఇక దాని గడువు ముగిసే వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకుంటే పొరపాటే. వీసా…
కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ).. తాజాగా మరో ఉద్యమానికి తెరదీసింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్.. జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు…