కొంచెం స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న హీరోకు కొడుకు పుట్టాడంటే చాలు.. ఆ పిల్లాడు కూడా హీరోనే అని ఫిక్స్ అయిపోతారు అభిమానులు. హీరోల అల్లుళ్లు, దూరపు చుట్టాలు కూడా హీరోలు అయిపోతున్న ఈ రోజుల్లో ఇక స్టార్ హీరోల కొడుకులు హీరోలు కాకుండా ఎలా ఉంటారు. అందులోనూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి అల్టిమేట్ క్రేజ్ ఉన్న స్టార్ హీరో కొడుకు మీద అభిమానుల్లో ఏ స్థాయిలో అంచనాలుంటాయో తెలిసిందే.
పవన్, రేణు దేశాయ్‌ల తనయుడైన అకీరా నందన్ టీనేజీలో ఉండగానే మాంచి ఫాలోయింగ్ సంపాదించేశాడు. అతను ఎప్పుడైనా బయట మీడియా కళ్లలో పడ్డాడంటే చాలు.. సోషల్ మీడియాలో ఆ ఫొటోలు వైరల్ అయిపోతాయి. అకీరా బర్త్‌డే అంటే స్టార్ హీరోల రేంజిలో అతడి పేరు ట్రెండ్ అవుతూ ఉంటుంది. ఈ స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్న కుర్రాడు.. నటనలోకి రాడు అంటే అభిమానులు ఊరుకుంటారా అన్నది ప్రశ్న.
ఇప్పుడీ ప్రశ్న ఎందుకొచ్చింది అంటే.. ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రంలో ఓ కీలక పాత్ర చేసిన రేణు దేశాయ్, దాని గురించి మీడియాతో మాట్లాడుతూ.. అకీరా గురించి ఎదురైన ప్రశ్నలకు సమాధానం చెప్పింది. అకీరాకు నటన మీద ఆసక్తి లేదని.. అతను డైరెక్షన్, సంగీతం లాంటి వాటి మీద ఫోకస్ చేస్తున్నాడని చెప్పింది. తాను కూడా అకీరా నటుడు కావాలని అనుకోవట్లేదని చెప్పింది. తాను కానీ, పవన్ కళ్యాణ్ కానీ అతణ్ని నటనలోకి రావాలని ఫోర్స్ చేయట్లేదని కూడా రేణు దేశాయ్ చెప్పడం గమనార్హం. ఈ మాటలు పవన్ అభిమానులకు రుచించలేదు.
అతను కాబోయే స్టార్ హీరో అని వాళ్లు ఎప్పుడో ఫిక్స్ అయిపోయారు. అతడి అరంగేట్రం గురించి కొన్నేళ్ల ముందు నుంచే చర్చలు సాగిస్తున్నారు. నిజంగా అకీరా నటన వద్దని డైరెక్షనో ఇంకొకటో చేసుకుంటే వాళ్లు ఊరుకుంటారా అని డౌట్. ఐతే రేణు ఇప్పుడు ఇలా అన్నా కూడా మున్ముందు ఆలోచన మారకుండా ఉండదు. చాలామంది వారసుల విషయంలో వాళ్ల తల్లిదండ్రులు ముందు ఇలాగే మాట్లాడినా.. తర్వాత హీరోగా పరిచయం చేశారు. కాబట్టి అకీరా టైం వచ్చే వరకు ఎదురు చూడాలి తప్ప ఫ్యాన్స్ మరీ కంగారు పడాల్సిన పని లేదు.
This post was last modified on October 14, 2023 3:21 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…