శ్రీలీల.. ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్. తెలుగమ్మాయే అయినప్పటికీ కర్ణాటకలో పెరిగి, అక్కడే తెరంగేట్రం చేసిన ఈ అమ్మాయి.. ‘పెళ్ళి సందడి’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ సినిమా ఎలా ఉన్నప్పటికీ.. అందులో తన అందం, అభినయం, నృత్య ప్రతిభ చూసి అవకాశాలు వరుస కట్టాయి. రెండో సినిమా ‘ధమాకా’ బ్లాక్ బస్టర్ కావడంతో శ్రీలీల డిమాండ్ మామూలుగా లేదు. ‘గుంటూరు కారం’ సహా పెద్ద పెద్ద సినిమాల్లో అవకాశాలు అందుకుంది.
తన వయసు కేవలం 22 ఏళ్లే. ఈ వయసుకే టాలీవుడ్ నంబర్ వన్ హీరోయిన్‌గా ఆమె వెలిగిపోతోంది. ఇంత చిన్న వయసులో, కెరీర్ ఇంత మంచి ఊపులో ఉండగా ఏ హీరోయిన్ అయినా పెళ్లి చేసుకుంటుందా? ఈ మాత్రం కామన్ సెన్స్ లేకుండా ఆమె పెళ్లి గురించి వార్తలు పుట్టించి ప్రచారం చేసేస్తున్నారు కొందరు. శ్రీలీల పెళ్లి గురించి వార్తలు పుట్టించడానికి దారి తీసిన కారణం చూస్తే మరీ సిల్లీగా అనిపించడం ఖాయం.
సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణతో కలిసి శ్రీలీల నటించిన ‘భగవంత్ కేసరి’ రిలీజ్‌కు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా టీంతో కలిసి బాలయ్య, శ్రీలీల ఉన్న ఫొటోలో.. బాలయ్య తనయుడు మోక్షజ్ఞ కూడా ఉన్నాడు. బాలయ్య పక్కన శ్రీలీల నిలబడి ఉంటే.. తన పక్కన మోక్షు ఉన్నాడు. ఈ మాత్రానికే వీళ్లిద్దరికీ పెళ్లయిపోతున్నట్లు రూమర్లు పుట్టించేస్తున్నారు.
కేవలం ఈ ఒక్క ఫొటోను చూసి పెళ్లి గురించి ఊహాగానాలు పుట్టించడం చూస్తే ఏమనాలో అర్థం కాదు. మోక్షును త్వరలో హీరోగా పరిచయం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఓవైపు ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ మీద దృష్టిపెడుతూనే.. సినిమాల మేకింగ్ మీదా అవగాహన పెంచుకుంటున్నాడు మోక్షు. ఈ క్రమంలోనే అతను ‘భగవంత్ కేసరి’ టీంతో అసోసియేట్ అయ్యాడు. అందుకే తరచుగా ఆ టీంతో కలిసి ఫొటోల్లో కనిపిస్తున్నాడు. ఆ మాత్రానికే శ్రీలీలను అతను పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు పుట్టించడం విడ్డూరం.
This post was last modified on October 11, 2023 4:36 pm
గత కొన్నేళ్లలో అర్ధ శతదినోత్సవం, హండ్రెడ్ డేస్ పదాలు అరుదైపోయాయి. ఏ సినిమా అయినా ఎన్ని వందల కోట్లు వసూలు…
ఎక్కడో ఢిల్లీలో రెండేళ్ల కిందట ప్రియురాలిని చంపి.. ముక్కలు చేసి ఫ్రిజ్లో పెట్టి.. విడతల వారీగా వాటిని అడవిలో విసిరేసిన…
యావత్ ప్రపంచం ఆసక్తిగా మాట్లాడుకుంటున్న మహా కుంభమేళాలో.. అతి సాదాసీదాగా పూసలు అమ్ముకునేందుకు వచ్చిన పదహారేళ్ల అమ్మాయి ఇప్పుడు ప్రపంచానికి…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ కు నేటితో 41 ఏళ్లు నిండాయి.…
నేడు… జనవరి 23… టీడీపీ జాతీయ ప్రదాన కార్యదర్శి, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ జన్మదినం. మొన్నటి…
స్విట్జర్లాండ్ నగరం దావోస్ గడచిన 4 రోజులుగా భారీ జన సందోహంతో కిటకిటలాడుతోంది. దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్…