రాబోయే శుక్రవారం అన్ని మీడియం రేంజ్ సినిమాలే తలపడుతుండటంతో బాక్సాఫీస్ యుద్ధం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఫిక్స్ చేసుకున్న వాటికి అదనంగా బొమ్మరిల్లు సిద్దార్థ్ నటించిన చిన్నా తోడయ్యింది. చిత్తా పేరుతో మొన్న తమిళంలో రిలీజైన ఈ థ్రిల్లర్ కం ఎమోషనల్ డ్రామాకు అక్కడ మంచి స్పందన దక్కింది. దీనికన్నా ఎక్కువ అంచనాలు మోసుకొచ్చిన జయం రవి ఇరైవన్ ని పక్కకు తోసేసి మరీ ఆడియన్స్ ని థియేటర్లకు లాకొచ్చింది. స్కూల్ పిల్లల మీద లైంగిక వేధింపు, పోక్సో చట్టంలోని తీవ్రతను నేపథ్యంగా తీసుకుని దర్శకుడు అరుణ్ కుమార్ దీన్ని తీర్చిద్దిదారు.
ప్రాణంగా చూసుకునే పాప కనిపించకుండా పోయి ఒక దుర్మార్గుడి చేతికి దొరికిందని తెలిసినప్పుడు నరకయాతన పడే యువకుడి పాత్రలో సిద్దు మంచి నటన ప్రదర్శించాడు. చాలా తక్కువ బడ్జెట్ లో చిన్నా రూపొందింది. అంతా బాగానే ఉంది కానీ రూల్స్ రంజన్. మామా మశ్చీంద్ర, 800, మంత్ అఫ్ మధు, మ్యాడ్, ఆపరేషన్ రాణిగంజ్, ధోనోల పోటీని తట్టుకుని ఈ జాతరలో చిన్నా గెలవడం అంత సులభంగా ఉండదు. ఆసియన్ ఫిలింస్ పంపిణీ కాబట్టి థియేటర్లు దొరుకుతాయి కానీ జనాన్ని టికెట్లు కొనేలా చేయాలంటే స్క్రీన్లు ఉంటే సరిపోదు. ఆకట్టుకునే పబ్లిసిటీ చేయాలి.
దానికంత సరిపడా టైం అయితే లేదు. ఉన్న అయిదు రోజుల్లో ఒక్కసారిగా హైప్ వచ్చేయదు. అందుకే ఒకటి రెండు రోజుల ముందు ప్రీమియర్లు వేసే ఆలోచనలో టీమ్ ఉందట. అటు సిద్దార్థ్ చూస్తేనేమో వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్ ని నిలబెట్టుకోవడం కోసం తమిళనాడు ప్రమోషన్లలో బాగా యాక్టివ్ అయ్యాడు. ఇటీవలే కర్ణాటక కూడా వెళ్ళొచ్చాడు. హైదరాబాద్ లోనూ ఒక ఈవెంట్ చేసి కొన్ని ఇంటర్వ్యూలు ప్లాన్ చేసేలా సమయం లేదు మిత్రమా అంటూ చిన్నా బృందం సన్నద్ధమవుతోంది. అరవ ఆడియన్స్ ని మెప్పించిన చిన్నా తెలుగు జనాలకు ఏ మేరకు నచ్చుతాడో చూడాలి.
This post was last modified on October 1, 2023 6:34 pm
రామ్ చరణ్ కొత్త సినిమా పెద్ది మీద ఆయన అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఆచార్య, గేమ్ చేంజర్ సినిమాలు…
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గురువారంతో ముగిశాయి. గతంలో ఎన్నడూ లేనంత వాడీవేడీగా సాగిన ఈ సమావేశాల్లో చాలా అంశాలపై…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు శుక్రవారం తమిళనాడు రాజధాని చెన్నైలో పర్యటించారు. నగరంలోని ఐఐటీ మద్రాస్ లో…
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ మోహన్ కు శుక్రవారం డబుల్ షాక్ తగిలింది. దళిత యువకుడు…
ఆసియాలో ప్రముఖ పర్యాటక దేశంగా పేరుగాంచిన థాయ్ ల్యాండ్ తో పాటు నిత్యం అంతర్యుద్ధంతో సతమతం అవుతున్న మయన్మార్ లను…
తెలంగాణలో కేబినెట్ విస్తరణకు సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఓ క్లారిటీ ఇచ్చేసింది. ఇటీవలే ఢిల్లీ వెళ్లిన సీఎం…