Movie News

2005 హాలీవుడ్ మూవీ స్ఫూర్తితో లియో?

దసరా పండగ సందర్భంగా భగవంత్ కేసరితో పాటు అక్టోబర్ 19 విడుదల కాబోతున్న విజయ్ లియో మీద తమిళంతో పాటు ఇతర భాషల్లోనూ మెల్లగా అంచనాలు ఎగబాకుతున్నాయి. పోస్టర్ల విషయంలో కొంత ట్రోలింగ్ ఎదురవుతున్నప్పటికీ రిలీజ్ నాటికి పరిస్థితిలో ఊహించని మార్పు వస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒవర్సీస్ బయ్యర్లు నలభై రోజుల ముందే యుకెలో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుపెట్టడం గొప్ప ఫలితాన్ని ఇచ్చింది. తెలుగుతో కలిపి ముప్పై వేల టికెట్లు అమ్ముడుపోయినట్టు స్థానిక డిస్ట్రిబ్యూటర్ అఫీషియల్ గానే ప్రకటించారు.

ఇదిలా ఉండగా లియో కథని 2005లో వచ్చిన ఒక హాలీవుడ్ మూవీని స్ఫూర్తిగా తీసుకుని దర్శకుడు లోకేష్ కనగరాజ్ రాసుకున్నట్టు చెన్నై గాసిప్. దాని పేరు ఏ హిస్టరీ అఫ్ వయొలెన్స్. ఇది 1997లో జాన్ వానర్-విన్సీ లాక్ సంయుక్తంగా  రాసిన నవల ఆధారంగా తీసినది. కథ చూస్తే హీరో భార్యాపిల్లలతో ఒక రెస్టారెంట్ నడుపుతుంటాడు . ఇద్దరు రౌడీలు వచ్చి ఓ మహిళా ఉద్యోగిని అల్లరి చేయబోతే వాళ్ళను చంపేస్తాడు. అప్పుడో వ్యక్తి వచ్చి నువ్వు సామాన్యుడివి కాదని, పెద్ద మాఫియా సామ్రాజ్యంతో సంబంధం ఉందని గతాన్ని వివరిస్తాడు. అదంతా కొట్టి పారేసిన హీరో తర్వాత నేర ప్రపంచంలోకి అడుగు పెట్టాల్సి వస్తుంది. ఇంటర్వెల్ తర్వాత ఫుల్ యాక్షన్ మోడ్ లో భారీ ఫైట్లు ఛేజులతో సాగుతుంది.

ఇది నిజమని చెప్పేందుకు ఆధారాలు లేవు కానీ టీజర్ తో పోల్చుకుని చూస్తే కొట్టిపారేయలేని విధంగా ఉంది. ఏ హిస్టరీ అఫ్ వయొలెన్స్ అప్పట్లో మంచి విజయం సాధించింది. స్క్రీన్ ప్లే ఇంటెలిజెంట్ గా పేరున్న లోకేష్ కనగరాజ్ తనదైన హీరోయిజం ఎలివేషన్లతో ఇలాంటి స్టోరీని ఏ రేంజ్ లో ప్రెజెంట్ చేస్తాడో వేరే చెప్పాలా. ఒరిజినల్ ఐమ్యాక్స్ ఫార్మాట్ లో విడుదల కాబోతున్న లియో రజనీకాంత్ జైలర్ రికార్డులను టార్గెట్ గా పెట్టుకుంది. వెయ్యి కోట్లను సాధించే సత్తా కూడా ఉందని ఫ్యాన్స్ తెగ ఊహించేసుకుంటున్నారు. తెలుగులోనూ భారీ ఎత్తున రిలీజ్ కు సితార సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. 

This post was last modified on September 26, 2023 8:19 pm

Share

Recent Posts

బారికేడ్లు లేని హైవేలు.. ఏంటీ కొత్త విధానం!

ఒక ఊరు నుంచి మ‌రో ఊరుకు జాతీయ ర‌హ‌దారి(హైవే)పై ప్ర‌యాణించే స‌మ‌యంలో టోల్ గేట్లు దాట‌డం త‌ప్ప‌నిస‌రి. ఈ టోల్…

31 minutes ago

నాని వాళ్ళని ఎప్పటికీ వదలడు

నేచుర‌ల్ స్టార్ నాని అంటే ఒక‌ప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్ట‌ర్ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌. ఎక్కువ‌గా ఫ్యామిలీ ట‌చ్ ఉన్న…

4 hours ago

డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ చేసేవాడ్ని

నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…

6 hours ago

ప్యార‌డైజ్ ద‌ర్శ‌కుడు రాజమౌళి ద‌గ్గ‌ర చేరతాడ‌ట‌

ఇండియాస్ నంబ‌ర్ వన్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి ద‌గ్గ‌ర ద‌ర్శ‌క‌త్వ విభాగంలో ప‌ని చేయాల‌ని కాబోయే డైరెక్ట‌ర్ కావాల‌నుకున్న ప్ర‌తి వ్య‌క్తికీ…

7 hours ago

ట్రైలర్ లేకపోవడం ఎంత వరకు సేఫ్

అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…

9 hours ago

ఇంద్ర చూపిన దారిలో మిగిలినవీ రావాలి

తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…

10 hours ago