చాలా చిన్న వయసులో యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టి ఇంకా శాటిలైట్ ఛానల్స్ అప్పుడప్పుడే ఎదుగుతున్న టైంలో మంచి పేరు తెచ్చుకున్న అమ్మాయి స్వాతి రెడ్డి. ప్రోగ్రామే ఇంటి పేరుగా మారిపోయే రేంజ్ లో పాపులారిటీ వచ్చింది. తర్వాత ఇండస్ట్రీకి వచ్చి సినిమాలూ చేసింది. వాటిలో బాగా చెప్పుకోదగినది అష్టా చెమ్మా. మహేష్ బాబు వీరాభిమానిగా అందులో ఆమె చూపించిన నటన మాములుది కాదు. ఆరేళ్ళ క్రితం లండన్ బాబులు చేసింది కానీ అది ఫ్లాప్ కావడంతో గ్యాప్ తీసుకుంది. ఇటీవలే పంచతంత్రం అనే మూవీ థియేటర్లలో ఆడకపోయినా ఓటిటిలో బాగానే రెస్పాన్స్ తెచ్చుకుంది.
తిరిగి ఇప్పుడు మంత్ అఫ్ మధుతో అక్టోబర్ 6న హీరో నవీన్ చంద్రతో కలిసి థియేటర్ ఆడియన్స్ ని పలకరించబోతోంది. ఈ సందర్భంగా సాయి తేజ్ అతిథిగా జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో తన వైవాహిక జీవితానికి సంబంధించిన ప్రశ్న ఎదురైతే నిర్మొహమాటంగా నే చెప్పను కాక చెప్పను అని తెగేసి బదులు ఇవ్వడం మీడియాని ఆశ్చర్యానికి గురి చేసింది. విడాకుల వ్యవహారం సాధారణ విషయమే అయినా దానికి సినిమాకి సంబంధం లేదు కాబట్టి ఆ ప్రస్తావనే తేవొద్దనేలా సమాధానం చెప్పిన తీరు సోషల్ మీడియాలోనూ వైరలవుతోంది. నే చెప్పా అంటూ పదే పదే కౌంటరివ్వడం పేలింది.
తారల వ్యక్తిగత జీవితాలు వాళ్ళ ఇష్టమైనా నలుగురి ముందుకు వచ్చినప్పుడు అన్ని రకాల విషయాలు చర్చకు వస్తాయి. స్వాతి చెప్పిన విధానం కొంత హార్ష్ గా ఉన్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో అలా చెబితే తప్ప అర్థం చేసుకోరు కాబట్టి తప్పలేదేమో. చిన్న సినిమాలతో పోటీ పడనున్న మంత్ అఫ్ మధుకి స్టార్ క్యాస్టింగ్ లేదు. శ్రీకాంత్ నగోతి దర్శకత్వం వహించగా ఘట్టమనేని మంజుల, వైవా హర్ష, రాజా రవీంద్ర, రుచిత తదితరులు ఇతర పాత్రలు పోషించారు. షూటింగ్ పూర్తయి నెలలు గడిచినప్పటికీ ఫైనల్ గా మోక్షం దక్కించుకుంది. నవీన్ చంద్ర, స్వాతిరెడ్డిల జోడి ఎలా మెప్పించబోతోందో చూడాలి.
This post was last modified on September 26, 2023 4:34 pm
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…